మృత్యువు ఎవరిని ఎప్పుడు తీసుకెళ్తుందో ఎవరం చెప్పలేము.. వారు చిన్నా, పెద్దా అనే తేడా కూడా ఉండదు. అప్పటివరకు సంతోషంగా ఉన్న కుటుంబాలు.. ఈ చీకు చింత లేకుండా అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు. భార్య పిల్లలతో మరువలేని క్షణాలను పోగుచేసుకున్న ఆ ఇద్దరికీ రెప్పపాటు కాలంలో మృత్యువు పరిచయం అయ్యింది. కుటుంబం చూస్తూ ఉండగానే వారు మృత్యుఒడికి చేరుకున్నారు. ఆ రెండు కుటుంబాలలో పిక్నిక్ విషాదాన్ని నింపింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది
వివరాల్లోకి వెళితే.. దంతేవాడలోని కిరండోల్ నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ)లో ప్రదీప్ దత్తా(50), సంజయ్ రాయ్(45) విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు మంచి స్నేహితులు. సెలవు దొరికినప్పుడల్లా ఇరు కుటుంబాలు పిక్నిక్ కి వెళ్తూఉంటాయి. ఎప్పటిలానే ఆదివారం కూడా రెండు కుటుంబాలు బర్సూత్ సాత్ థార్‌లో పిక్నిక్ చేసుకునేందుకు వెళ్లారు. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంజాయ్ చేశారు.
భోజనాల తర్వాత పిల్లతో కలిసి ఇద్దరు నదిఒడ్డున ఆడుకుంటున్నారు. ఇంతలోనే మృత్యువు ఆలా రొప్పంలో వచ్చింది. ఆ పెద్ద అలకు ప్రదీప్ దత్తా, సంజయ్ రాయ్‌లు పట్టుతప్పి నీటిలో పడిపోయారు. కుటుంబ సభ్యులు చూస్తూ ఉండగానే వారిద్దరూ నదిలో కొట్టుకుపోయారు. ఎవరైనా ఉంటే కాపాడాలని కుటుంబ సభ్యులు అరిచిన అరుపులు వృధా అయ్యాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం వచ్చి 14 గంటల శ్రమించి మృతదేహాలను కనుగొన్నారు.ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.