రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకొంది. జీవితంపై విరక్తి చెందిన ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలలోకి వెళితే.. బుండి జిల్లాకు చెందిన ముస్కాన్ మేఘ్వాల్(19), హీరాలాల్ మేఘ్వాల్(24) అనే ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుంటున్నారు. రోజు వారిద్దరూ ఎవరికి తెలియకుండా ఊరికి కొద్దీ దూరంలో ఉండే నిర్మానుష్యమైన ప్రదేశంలో కలుసుకొనేవారు. ఎప్పటిలానే శుక్రవారం కూడా వారు కలుసుకొని ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డుకు పక్కన ఉనన్ పొదల్లో బైక్ పార్క్ చేసి, పక్కనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అర్ధరాత్రి అటువైపు వెళ్తున్న ఒక వ్యక్తి పొదల్లో బైక్ ని చూసి ముందుకు వెళ్లి చూడగా ఇద్దరు ప్రేమికులు గిలగిలా కొట్టుకుంటూ కనిపించారు.. దీంతో అతడు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొనేసరికి ఇద్దరు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పక్కనే సూసైడ్ నోట్ కూడా లభ్యమయ్యిందని, జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు రాసి ఉందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు.