France: సొంత భార్యకి మత్తు మందు ఇచ్చి ఏకంగా 10 ఏళ్ల పాటు అత్యాచారం చేయించాడో భర్త. 50 మంది వరకు పురుషులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. ఈ ఉదంతం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా తనకు జరిగిన ఘోరమైన ఘటన గురించి ఆమె కోర్టులో చెప్పింది. దక్షిణ ఫ్రాన్స్ నగరమైన అవిగ్నాన్‌లోని గిసెల్ పెలికాట్(72) మత్తులో ఉన్న సమయంలో ఆమె భర్త డోమినిక్ పెలికాట్(71) తనపై అత్యాచారం చేయడానికి చాలా మంది పురుషుల్ని ఆహ్వానించినట్లు వివరించింది.
ఇది దాదాపుగా ఒక దశాబ్ధం పాటు వారి ఇంటిలో దాదాపుగా 100 సార్లు సాగింది. అయితే, ఆమె భర్త అనుమానిత అత్యాచారాలను ఒక క్రమపద్ధతిలో చిత్రీకరించాడు. వేలకొద్ది వీడియోలను భద్రపరిచాడని అధికారులు కనుగొన్నారు. ‘‘ నేను దుర్మార్గపు బలిపీఠం మీద బలి ఇవ్వబడ్డాను. వారు నన్ను గుడ్డ బొమ్మలా, చెత్త కుండీలా చూశారు. ఇకపై నాకు గుర్తింపు లేదు. ఎప్పటికైనా నన్ను నేను పునర్నిర్మించుకుంటానో లేదో నాకు తెలియదు.’’ అని కోర్టులో సాక్ష్యమిచ్చినట్లు ఇండిపెండెంట్ నివేదించింది.
READ ALSO: Delhi: కాంగ్రెస్‌లో చేరిన భారత రెజర్లు వినేష్ ఫోగట్, పునియా.. హర్యానా నుంచి బరిలోకి..!
నాకు సంబంధించి ప్రతీది కూలిపోతోంది. ఇది అనాగరిక అత్యాచార దృశ్యాలని, హెచ్ఐవీ ఉందని తెలిసిన వ్యక్తి తనను కనీసం ఆరుసార్లు అనుభవించాడని చెప్పింది. “నా ప్రాణం ప్రమాదంలో ఉంది, కానీ ఒక్క సెకను కూడా ఎవరూ ఆపలేదు… ఆరుసార్లు (నన్ను రేప్ చేయడానికి) వచ్చిన ఒక వ్యక్తి హెచ్ఐవీ ఉన్నందున నాకు హెచ్‌ఐవి పరీక్షలు జరిగాయి,’’ అని ఆమెపై జరిగిన అఘాయిత్యాల గురించి సాక్ష్యమిచ్చింది. 2011 నుంచి 2022 వరకు ఆమెపై అకృత్యాలు కొనసాగాయి. పోలీసులు తన ప్రాణాలు కాపాడినట్లు చెప్పింది.
దక్షిణ ఫ్రాన్సులోని ఒక గ్రామంలో మహిళ ఇంటికి సమీపంలో ఉన్న సూపర్ మార్కెట్‌లో మహిళల స్కర్టుల్ని చిత్రీకరిస్తున్న సమయంలో గార్డులు ఆమె భర్తను పట్టుకున్నారు. దీని తర్వాత 2020లో తన భర్త కంప్యూటర్‌ని శోధించిన పోలీసులకు ఈ అఘాయిత్యం గురించి తెలిసింది. దీని తర్వాత పోలీసులు తన ప్రాణాల్ని కాపాడినట్లు మహిళ వెల్లడించింది. తన భర్త చిత్రీకరించిన వీడియోలను తొలిసారిగా పోలీసులు చూపినప్పుడు తనలో పెద్ద సునామీ, విస్పోటన పరిస్థితి ఏర్పడిందని గిసెల్ పెలికాట్ చెప్పారు. ‘‘ నా ప్రపంచం నాశనమైంది. నేను 50 ఏళ్లుగా నిర్మించుకున్న నాశనమయ్యాయి. ఇవి తనకు భయంకరమైన దృశ్యాలు’’ అని ఆమె కోర్టులో తల వంచుకుని ఆవేదనతో చెప్పింది.
కేసు దర్యాప్తులో డొమినిక్ పెలికాట్ కంప్యూటర్‌కి కనెక్ట్ చేయబడిని యూఎస్‌బీ డ్రైవ్‌లో ఆమెపై జరిగిన ఘోరాలు ఉన్నాయని పోలీసు నివేదిక పేర్కొంది. దాదాపుగా 20,000 ఫోటోలో, దాదాపుగా 100 సార్లు అత్యాచారం చేయబడిన వీడియోలు ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడైన భర్త నిద్రమాత్రలు, యాంటీ యాంగ్జైటీ మందులు కలిపి వాటిని తన భార్యకు భోజనం, లేదా వైన్ ద్వారా ఇచ్చే వాడు. ఆ తర్వాత తన భార్యపై రేప్ చేయడానికి పురుషుల్ని ఆన్‌లైన్ ద్వారా ఆహ్వానించే వాడు. డొమినిక్ పెలికాట్‌తో పాటు 26 నుంచి 74 ఏళ్ల మధ్య వయసున్న 50 మంది పురుషులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఆమె భర్త, 14 మంది ఇతర నిందితులు అత్యాచార ఆరోపల్ని అంగీకరించారు. అయితే, 35 మంది పురుషులు వీటిని ఖండించారు. మహిళ తన స్వేచ్ఛ మేరకు సెక్స్‌కి అంగీకరించిందని పేర్కొన్నారు.