Khairatabad Ganesh 2024: ఖైరతాబాద్ మహాగణపతి కి రెండో రోజు ఘనంగా పూజలు కొనసాగుతున్నాయి. ఆదివారం కావడంతో ఉదయం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. నాలుగు క్యూ లైన్లలో గణేషుడిని చూసేందుకు బారులు తీరారు. క్యూలైన్లతో పాటు ఎక్కువ సమయం కాకూడదని మధ్యలో నుంచి భక్తులను వదులుతున్న నిర్వాహకులు. ఖైరతాబాద్ గణపతి వరకు వెళ్లకుండా ముందు నుంచి దర్శనం చేసుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ గణనాథుడు ని దర్శనం చేసుకుంటున్న భక్తులు. పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్యా అలెర్ట్ అయ్యిన పోలీసులు. వెను వెంటనే భక్తులను క్యూ లైన్ నుండి ముందుకు కదుపుతున్న అధికారులు. ఖైరతాబాద్ గణేష్ భక్తుల రద్దీ గంట గంటకూ పెరుగుతుంది. నలువైపులా ఏర్పాటు చేసిన క్యూ లైన్ల నుండి భక్త జనం భారీగా వస్తున్నారు. వేల సంఖ్యలో బడా గణేష్ ను దర్శించుకుంటున్నారు. నిన్న సుమారు రెండు లక్షల పైగా బడా గణేష్ ను దర్శించుకున్నాట్లు సమాచారం. ఈ రోజు కూడా సెలవు దినం కాబట్టి అధిక సంఖ్యలో బడా గణేష్ ను దర్శించుకునే అవకాశం ఉందిన అధికారులు అంచనావేస్తున్నారు. బడా గణేష్ ను చూసేందుకు నలు వైపులా భక్త జనం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే ఖైరతబాద్ లో వర్షం కురుస్తున్న భక్తులు రద్దీ కొనసాగుతూనే ఉంది. వర్షం లో తడుస్తూ ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకుంటున్న భక్తులు.
Kishan Reddy: మున్నేరు వరద బాధితులకు నిత్యవసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేసిన కిషన్ రెడ్డి..