Harish Rao: అక్కడ ఒక రూల్.. తెలంగాణలో మరో రూలా ? అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్ లో హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ మీడియా సమావేశం ఆవేదన తో పెడుతున్నాను అన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీల ఏర్పాటుకు ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. సమావేశాలు ముగిసి 38 రోజులు అవుతున్నా వాటి పై ఈ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేత వేణుగోపాల్ పీఏసీ చైర్మన్ గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. అక్కడ ఒక రూల్ .. తెలంగాణలో మరో రూలా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారు. ఆ రాజ్యాంగం తెలంగాణకు వర్తించదా ? అని అన్నారు.
Read also: Khairatabad Ganesh 2024: గంట గంటకూ పెరుగుతున్న ఖైరతాబాద్ గణేష్ భక్తుల రద్దీ..
మండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూధనా చారి పేరు ఇచ్చి 40 రోజులు అవుతోందిదాని పై కూడా నిర్ణయం లేదన్నారు. ఈ ఆలస్యాలకు కారణం ఏమిటీ ? శాసన సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు విద్యావంతుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ,పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీ , మండలిలో ప్రతిపక్ష నేత నియామకాల పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని శ్రీధర్ బాబును కోరుతున్నా అని తెలిపారు. రాహుల్ గాంధీకి ఈ విషయమై ట్వీట్ కూడా చేస్తా అన్నారు. రైతు రుణమాఫీ జరగలేదని సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తుచేశారు. నా చావు కు కారణం క్రాప్ లోన్ అవ్వక పోవడం అని సూసైడ్ నోట్ రాశారని తెలిపారు. తన తల్లి కి తనకి కలిసి ఉన్న రేషన్ కార్డు ఉండడం వల్ల రుణమాఫీ కాలేదన్నారు. బ్యాంక్ మేనేజర్ రుణమాఫీ జరగదు అని చెప్పడంతో బాధ పడ్డాడని, ప్రభుత్వ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రేషన్ కార్డు అవసరం లేదు అని చెప్పింది.. కానీ అది అవాస్తవం అన్నారు.
Read also: Kishan Reddy: మున్నేరు వరద బాధితులకు నిత్యవసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేసిన కిషన్ రెడ్డి..
రాష్ట్రం లో శాంతి భద్రతల పరిస్థితి గురించి మాట్లాడాను .ఇది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. పొలీసు అధికారుల ఎవరి వత్తిడికో తలొగ్గి మాట్లాడొద్దన్నారు. కేసీఆర్ హాయంలో పోలీసులకు స్టేషనరీ ఖర్చుకు నెలకు డబ్బులు కేటాయించామన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ..దాని పై పొలిసు అధికారుల సంఘం ఎందుకు మాట్లాడదు ? అని ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలీసులకు సరెండర్ లీవ్ ఏంక్యాష్ మెంట్ ఎందుకు కావడం లేదు ..దానిపై పొలిసు అధికారుల సంఘం ఎందుకు ప్రశ్నించదన్నారు. ప్రభుత్వం పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. అందరికీ రుణమాఫీ చేస్తాం అని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత మాట మార్చారన్నారు. ప్రభుత్వ తీరు వల్ల కుటుంబాల మధ్య గొడవలు అవుతున్నాయన్నారు. తల్లికొడుకులు, అన్నదమ్ముల మధ్య ఈ ప్రభుత్వం చిచ్చు పెట్టిందన్నారు. రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ప్రభుత్వం 31 కారణాలు చూపించారన్నారు. రేషన్ కార్డు సమస్య ఒకటి అయితే… పదిహేను ఏళ్ల క్రితం చనిపోయిన భర్త ఆధార్ కార్డ్ తీసుకు రావాలి అంటున్నారని తెలిపారు. పెళ్లి చేసుకోలేదని మరో రైతుకు రుణమాఫీ జరగలేదని మండిపడ్డారు.
Murali Mohan: హైడ్రా అవసరం లేదు.. మేమే కూల్చేస్తాం.. నోటీసులపై మురళీమోహన్..