Crime: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. రహస్యం బయటపెట్టిన కొడుకు
- యూపీలోని షాజహాన్‌పూర్‌లో సంచలన కేసు
- ప్రియురాలు ప్రియుడితో కలిసి భర్త తలను ఇటుకతో బాది హత్య
- భర్త మృతదేహంపై ఇటుకలను పడేసిన నిందితులు
- రాత్రి ఇటుకలు పడిపోవడంతో భర్త మృతి చెందాడని చెప్పిన భార్య
- అసలు విషయాన్ని బయటపెట్టిన ఏడేళ్ల కొడుకు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని షాజహాన్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు ప్రియుడితో కలిసి భర్త తలను ఇటుకతో బాది హత్య చేసింది. అనంతరం.. భర్త మృతదేహంపై ఇటుకలను పడేశారు. ఉదయం తన తల్లి ఇంటికి వెళ్లిన భార్య రాత్రి ఇటుకలు పడిపోవడంతో భర్త మృతి చెందాడని చెప్పింది. మృతదేహంపై తల తప్ప మరెక్కడా గాయాలు లేకపోవడంతో ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా.. తన తల్లి, ప్రియుడితో కలిసి తన నాన్నను హత్య చేసిన మొత్తం కథను ఏడేళ్ల కొడుకు అలీషాన్ పోలీసులకు వివరించాడు. దీంతో.. పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రేమికుడు పరారీలో ఉన్నాడు.
Read Also: YSRCP: జగన్ జన్మదినం రోజున సేవా కార్యక్రమాలు.. పార్టీ శ్రేణులకు వైసీపీ పిలుపు
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
ఈ ఘటన తఖుర్ద్‌కలన్ గ్రామంలో చోటుచేసుకుంది. భర్త.. 40 ఏళ్ల యూనస్ గ్రామంలో టిన్ షెడ్‌లో నివసిస్తున్నాడు. అతని భార్య షమింబానో.. 20 ఏళ్ల కుమారుడు రిజ్వాన్, 15 ఏళ్ల కుమారుడు సావాన్, 7 ఏళ్ల కుమారుడు అలీషాన్ ఇంట్లో నివసిస్తున్నారు. యూనస్ అత్తమామల ఇల్లు కూడా అదే గ్రామం. కాగా.. తన కొడుకు రిజ్వాన్‌కు కూడా అదే గ్రామంలో సంవత్సరం క్రితం వివాహం చేశాడు. రిజ్వాన్ బావమరిది మనోస్ అలీకి.. రిజ్వాన్ తల్లి షమీంబనోతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న భర్త యూనస్ తన భార్య షమీబాన్‌ను కనిపెట్టుకుంటూ ఉన్నాడు. 8 రోజుల క్రితం గ్రామస్థులు షమీంబనో, మనోస్ అలీని చెరువు ఒడ్డున అభ్యంతరకరమైన స్థితిలో చూశారు. ఈ క్రమంలో.. బంధువుల మధ్య పంచాయితీ కూడా జరిగింది. యూనస్ రాజీకి వచ్చాడు. యూనస్ కుమారులు రిజ్వాన్, సావాన్ ఢిల్లీకి కూలి పనికి వెళ్లారు. షమింబానో ఆమె తల్లి ఇంట్లో ఉంది.
Read Also: Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు
శుక్రవారం రాత్రి, మనుస్ అలీ తన ఇంటికి షమీంబనోను కలవడానికి వచ్చాడు. దానికి యూనస్ నిరసన తెలిపాడు. మనుస్ అలీ, షమింబానోలు నిరసన వ్యక్తం చేయడంతో వారు యూనస్ తలపై ఇటుకలతో కొట్టారు. ఈ సమయంలో.. యూనస్ 7 ఏళ్ల కుమారుడు అలీషాన్ నిద్ర నుండి లేచి తన తండ్రిని కొట్టడం చూసి అరవడం ప్రారంభించాడు. “మమ్మీ, అబ్బుజాన్‌ను చంపవద్దు” అని అరిచాడు. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి కొడుకుని బెదిరించారు. ఈ విషయాలన్నీ పోలీసులు, బంధువుల ముందు చెప్పిన అలీషాన్.. తండ్రి హత్యను బయటపెట్టాడు. ఈ క్రమంలో.. భార్య షమీంబనోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. ప్రియుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
- Tags
- boyfriend
- husband
- Killed
- son
- telugu news
తాజావార్తలు
-
The Paradise Censor Cuts: ‘ది ప్యారడైజ్’లో పొలిటికల్ బాంబ్.. సెన్సార్‌ను వణికించిన లీడర్ల పేర్లు ! ఏకంగా 21 చోట్ల కత్తెర..
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
-
ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
-
AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!