Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- వెల్లూరులో నిర్మాణంలో ఉన్న చర్చి కూలింది
- ముగ్గురు కార్మికులు మృతి, 11 మంది గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Church Roof Collapse: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ చర్చి పైకప్పు కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. గురువారం రాత్రి వెల్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. చర్చి భవన నిర్మాణ పనుల్లో భాగంగా పైకప్పుపై కాంక్రీట్ వేస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయినట్లు సమాచారం. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు భారీ కాంక్రీట్ శిథిలాలు, ఇటుకలు, రాళ్ల కింద చిక్కుకుపోయారు.
కాంక్రీట్ వేస్తుండగా కూలిన స్లాబ్
కాట్పాడి సమీపంలోని మండీ కృష్ణాపురంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు చెందిన భవనం నిర్మాణంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో కార్మికులు పైకప్పుపై కాంక్రీట్ వేస్తున్నారు. అదే సమయంలో సుమారు 20 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన స్టీల్ స్కాఫోల్డింగ్, సపోర్ట్ ఫ్రేమ్‌వర్క్ ఒక్కసారిగా కూలిపోయినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. దీంతో పైకప్పు స్లాబ్ కూడా కూలి కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.
Also Read
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
11 మంది కార్మికులకు గాయాలు
ప్రమాదంలో గాయపడిన 11 మంది కార్మికులను అంబులెన్సుల ద్వారా వివిధ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరిని వెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి (CMC)కు తరలించారు. మరో కొంతమందిని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెల్లూరు జిల్లా కలెక్టర్ పి.ఎస్. లీలా అలెక్స్ తెలిపిన వివరాల ప్రకారం, గాయపడిన వారిలో కనీసం ఎనిమిది మంది పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది.
రంగంలోకి NDRF, ఫైర్ సిబ్బంది
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. అరక్కోణంలోని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందంతో పాటు జిల్లా యంత్రాంగం, పోలీసులు, ఫైర్ సర్వీస్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలను అధికారులు పర్యవేక్షించారు.
నిర్మాణ అనుమతులపై కూడా దర్యాప్తు
ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు. భవన నిర్మాణ సమయంలో అవసరమైన భద్రతా ప్రమాణాలను పాటించారా? నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు, బిల్డింగ్ పర్మిట్లు ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించనున్నారు. భవనం నిర్మాణం ఎందుకు కూలిపోయిందనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం లేదా భద్రతా నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?