ESI Hospital : హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో సోమవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి భవనంలో జరుగుతున్న రెనోవేషన్ పనుల్లో ఘోరం చోటుచేసుకుంది. ఎమర్జెన్సీ వార్డులో సెంట్రింగ్ పనులు కొనసాగుతుండగా అర్ధంతరంగా శిథిలాలు కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం ప్రకారం.. ఆస్పత్రి భవనంలో స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడి అక్కడ పని చేస్తున్న సెంట్రింగ్ కార్మికులపై పడింది. వారికి తప్పించుకునే అవకాశం కూడా లేకుండా కాంక్రీట్ ముక్కలు నేరుగా వారి మీదపడటంతో…
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో శనివారం బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరవాసులు వేడి నుంచి కొంత ఉపశమనం పొందారు. అయితే.. వర్షం, బలమైన గాలుల కారణంగా నష్టం జరిగింది. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. నబీ కరీం ప్రాంతంలోని అర్కాన్షా రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రదేశం నుంచి అందరినీ ఖాళీ చేయించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో…
Uppal Bhagayat: హైదరాబాద్ నగర శివారులోని ఉప్పల్ భాగాయత్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవన స్థలంలో పిల్లర్ కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. మృతిచెందిన బాలురు అర్జున్ (8) కాగా, మరొకరు మణికంఠ (15)గా అదిరికారులు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కుటుంబంతో పాటు వలస వచ్చిన ఈ చిన్నారులు, ఉప్పల్ లోని కుర్మానగర్ ప్రాంతంలో తాత్కాలిక నివాసం…
HCU : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో, అక్కడే పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ప్రమాదంలో చిక్కుకున్నారు. అదనపు మట్టిశ్రమకు లోనైన కార్మికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భవనం కూలిపోవడం గమనించిన తోటి కార్మికులు, యూనివర్సిటీ సిబ్బంది హుటాహుటిన స్పందించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే…
GHMC : హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న ఘటనపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సీరియస్ అయింది. భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి అనుమతుల కోసం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తేలడంతో, సంబంధిత భవనానికి ఇచ్చిన అనుమతులను బల్దియా రద్దు చేసింది. అపార్ట్‌మెంట్ నిర్మాణంలో సెట్ బ్యాక్ లేకపోవడంతో పాటు, బారికేడింగ్, రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయకుండా సెల్లార్ తవ్వకాలు జరిపినట్టు విచారణలో స్పష్టమైంది. అంతేగాక, ఈ తవ్వకాలు GHMC అధికారుల అనుమతి లేకుండా జరిగినట్టు…