Crime News: భార్యను హత్య చేసి.. ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రిటైర్డ్ మాజీ ఇస్రో ఉద్యోగి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. మాజీ ఇస్రో ఉద్యోగి నాగేశ్వరరావు (65) తన భార్య సంధ్య శ్రీ (60)ను వారి నివాసంలో టవల్ తో గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే సాధ్యం కాలేదు. ఘటన అనంతరం నాగేశ్వరరావు తన స్నేహితుడికి జరిగిన విషయం చెప్పాడు. దానితో అప్రమత్తమైన ఆ స్నేహితుడు వెంటనే అవలహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంధ్య శ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
Dolby Atmos ఆడియో, 4K QLED విజువల్ ఉన్న Vu Vibe Series mart Google TVపై రూ.39000 భారీ డిస్కౌంట్!
Also Read
- Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్‌లు!
- Family Suicide Case: "నా ఏటీఎం పిన్ ఇదే.. ఆ డబ్బులతోనే అంత్యక్రియలు చేయండి".. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్‌రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
ప్రాథమిక దర్యాప్తులో నాగేశ్వరరావు తన భార్యను తాను హత్య చేసినట్లు అంగీకరించాడు. గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతూ, డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. భార్య భవిష్యత్తుపై ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని తేలింది. మృతురాలు ‘సంధ్య శ్రీ’ కూడా ఇస్రోలో పనిచేశారు. ఈ దంపతులకు అమెరికాలో స్థిరపడిన ఒక కుమార్తె ఉన్నారు. ఆమెకు ఈ ఘటన గురించి సమాచారం అందించారు పోలీసులు. ప్రస్తుతం నాగేశ్వరరావుపై హత్య కేసు నమోదు చేసి.. అతని మానసిక స్థితి, వైద్య చరిత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Ambati Rambabu: ‘ఏడు జన్మలెత్తినా ఏం చేయలేవు’.. డిప్యూటీ సీఎం పవన్‌పై మాజీమంత్రి అంబటి ఫైర్
-
CM Revanth Reddy: రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం భేటీ.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై కీలక ప్రతిపాదనలు.!
-
Jio Bharat V4: రూ.799కే Jio Bharat V4 4G ఫీచర్ ఫోన్ విడుదల.. యూపీఐ, లైవ్ టీవీ, స్మార్ట్ ఫీచర్స్ తో
-
Uddhav Thackeray: పాపం ఉద్ధవ్ ఠాక్రే.. పొలిటికల్ షాక్ నుంచి కోలుకోవడం సాధ్యమేనా?
-
Allu Arjun గైర్హాజరు.. కోర్టు కీలక సూచనలు.!
ట్రెండింగ్
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!