Kolhapur Gold Theft: మామ ఇంట్లో బంగారం చోరీ చేసి థార్ కొనుగోలు.. కారు పూజకు మామే చీఫ్ గెస్ట్!
- మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో బంగారం చోరీ ఘటన
- మామ ఇంటి నుంచి 15 తులాల బంగారు ఆభరణాలు చోరీ
- వచ్చిన డబ్బుతో థార్ కారు కొనుగోలు, పూజకు మామకు ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolhapur Gold Theft: మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా ఓ దొంగతనం వైరల్‌గా మారింది. మామ ఇంట్లో దొంగిలించిన నగలుతో కారు కొనుగోలు చేసి, ఆ కారు పూజకు మామనే ఆహ్వానించి షాక్ ఇచ్చాడు ఓ యువకుడు. కొల్హాపూర్ జిల్లా సాత్వే గ్రామంలో సమర్ పోపట్ చవాన్ అనే 19 ఏళ్ల యువకుడు తన మామ ఉమేష్ మారుతి చవాన్ ఇంటి నుంచి 15 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. వాటిని స్థానిక బంగారు ఆభరణాల వ్యాపారి సంగ్రామ్ బాబాసో మోరే సహాయంతో రూ. 10 లక్షలకు విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
వచ్చిన డబ్బులో మహీంద్రా థార్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు పూజా కార్యక్రమాన్ని తన మామనే ఆహ్వానించాడు. కొత్త కారు పూజకు వెళ్లిన ఉమేష్, ఆ తర్వాత బంగారు ఆభరణాల కోసం వెతకగా అవి కనిపించలేదు. తన భార్యకు చెందిన నగలు పోయాయని గుర్తించిన ఉమేష్, అమ్మమ్మ ఆభరణాలు మాత్రం అలాగే ఉన్నాయని గుర్తించారు. దీంతో కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు అనుమానించాడు.
Also Read
దీంతో ఉమేష్ కొడోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు సమయంలో సమర్ ఖరీదైన కారు కొనుగోలు చేయడంతో అనుమానం వ్యక్తమైంది. కొత్తగా ఇంత పెద్ద కారు కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే అనుమానంతో విచారించగా సమర్ నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసుతో సమర్ చవాన్‌తో పాటు ఆభరణాల వ్యాపారి సంగ్రామ్ మోరేను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
-
PV Sindhu : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పి.వి.సింధు.. మరో సూపర్ 750 టైటిల్‌పై కన్ను
-
Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
-
Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!