Lawrence Bishnoi: ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్, రెండు గ్యాంగుల మధ్య వార్ ఇప్పుడు సంచలనంగా మారింది. గ్యాంగ్‌స్టర్ రోహిత్ం గోదారా, మరో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ‘‘దేశద్రోహి’’గా ఆరోపించాడు. బిష్ణోయ్ అమెరికా ఏజెన్సీతో కుమ్మక్కయ్యాడని, సున్నితమైన సమాచారాన్ని ఇస్తున్నట్లు వెల్లడించారు. ధ్రువీకరించని ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో గోదారా, బిష్ణోయ్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు.
లారెన్స్ బిష్ణోయ్‌కి అమెరికాలోని ఓ సంస్థతో సంబంధం ఉందని ఆరోపించాడు. బిష్ణోయ్ తన సోదరుడు అన్మోల్‌ను కాపాడుకోవడానికి అమెరికన్ ఏజెన్సీతో చేతులు కలిపాడని, వారికి దేశం గురించి నిఘా సమాచారాన్ని అందిస్తున్నాడని చెప్పాడు. బిష్ణోయ్ కీర్తి పొందడానికి నటుడు సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేశాడని ఆరోపించాడు. తనను లేదా తన గ్యాంగ్‌ను లారెన్స్ బిష్ణోయ్‌తో లింక్ చేయవద్దని గోదారా మీడియాను కోరాడు.
గ్యాంగ్‌స్టర్లు గోల్డీ బ్రార్, రోహిత్ గోదారాలను జాతీయ దర్యాప్తు సంస్థలు కోరుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో వీరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. బ్రార్ అమెరికాలో, రోహిత్ యూకేలో ఆశ్రయం పొందుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల, బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు జరిగాయి. షూటర్లు గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా గ్యాంగ్‌కు చెందిన వారు. ఇద్దరు షూటర్లు రవీంద అలియాస్ కులు, అరణ్‌లు యూపీ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.