రోడ్డు ప్రమాదాల కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. హైదరాబాద్ లో నిత్యం రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా నిత్యం రద్దీగా వుండే గచ్చిబౌలి విప్రో జుంక్షన్ నుండి IIIT జుంక్షన్ వైపు బైక్ పై వస్తున్న ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరు మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
IIIT జుంక్షన్ వద్ద ఉన్న సబ్ స్టేషన్ గేట్ ను వేగంగా వచ్చి ఢీ కొట్టిందా బైక్. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అరవింద్ కుమార్ సహో(28),మునిష్ కునర్ సాకేత్(25) మృతి చెందగా రాజ్ కుమార్(21) కు తీవ్ర గాయలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని హాస్పిటల్ కి తరలించారు. అతనికి ICUలో చికిత్స నిర్వహిస్తున్నారు. మరణించినవారు మధ్యప్రదేశ్ రాష్ట్రం సిద్ధి జిల్లా వాసులు. ముగ్గురూ కలిసి నానక్ రామ్ గూడ లోని ఓ రూంలో నివాసం వుంటున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.