Tragedy : హైదరాబాద్‌లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- రిటైర్డ్ IPS అధికారి ఇంట్లో దారుణ హత్య
- పనిమనిషే మాస్టర్ ప్లాన్.. నేపాలీ గ్యాంగ్‌పై అనుమానం
- నగదు, బంగారం దోచుకుని పరారైన నిందితులు
- సీసీటీవీ ఆధారాలతో గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య సునంద తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. దోపిడీ కోసమే పనిమనిషి తన గ్యాంగ్‌తో కలిసి ఈ మర్డర్‌కు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం వినయ్ రంజన్ రాయ్ బెంగళూరులో ఉండగా, ఇంట్లో సునంద ఒక్కరే ఉన్న సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది.
పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం, ఈ హత్య వెనుక నేపాలీ గ్యాంగ్ హస్తం ఉంది. వినయ్ రంజన్ రాయ్ ఇంట్లో గత 8 నెలలుగా కల్పన అనే నేపాలీ మహిళ పనిమనిషిగా ఉంటోంది. సునంద ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని పసిగట్టిన కల్పన, తన గ్యాంగ్‌కు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మొత్తం నలుగురు వ్యక్తులు కలిసి పక్కా స్కెచ్‌తో ఇంట్లోకి ప్రవేశించారు. సునందను చంపిన తర్వాత బ్యాగుల్లో భారీగా నగదు, గోల్డ్ ఆర్నమెంట్స్‌ను తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు.
Also Read
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు కీలక ఆధారాలు సేకరించారు. హత్యకు ముందు కల్పనను కలిసేందుకు ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. సునందను మర్డర్ చేసిన తర్వాత కల్పనతో పాటు మరో ముగ్గురు నిందితులు పరారయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంటికి కమిషనర్ సజ్జనార్ చేరుకుని బాధితులను పరామర్శించారు. నిందితులకు సంబంధించిన వీడియోలు , కోఆర్డినేషన్ డీటెయిల్స్‌ను పోలీసులు వాట్సప్ ద్వారా ఇతర టీమ్స్‌కు షేర్ చేశారు.
నలుగురు నిందితులు ప్లాన్ ప్రకారమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు కన్ఫర్మ్ చేశారు. నిందితుల కోసం స్పెషల్ పోలీస్ టీమ్స్ గాలిస్తున్నాయి. నమ్మకంగా ఉంటూనే దోపిడీ కోసం ఇంతటి ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. సిటీలో పనిమనుషులను పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, వారి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నేపాలీ గ్యాంగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!