T20 World Cup: ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. ‘వెళ్లి షాపింగ్, హోటల్లో డిన్నర్లు చేసుకోండి’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన తీవ్ర నిరాశకు గురిచేసింది. టోర్నీలో ఆడిన మొదటి మూడు మ్యాచ్‌ల్లోనే (భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ల చేతిలో) ఓటమి పాలై గ్రూప్ దశలోనే వెనుదిరగడంతో, జట్టు సభ్యులతో పాటు ముఖ్య కోచ్ వహాబ్ రియాజ్‌పై పాక్ క్రికెట్ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో 65 పరుగుల భారీ తేడాతో ఓడిన పాక్, ఆ తర్వాత సౌతాఫ్రికాతో గట్టి పోటీ ఇచ్చి 2 వికెట్ల తేడాతో ఓడింది. అయితే, బంగ్లాదేశ్‌తో జరిగిన లో-స్కోరింగ్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మైదానంలో ప్రదర్శన ఇలా ఉంటే.. మైదానం వెలుపల ఆటగాళ్ల ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. టోర్నమెంట్ సమయంలో క్రీడాకారిణులు బయట విహరిస్తూ, రెస్టారెంట్లలో డిన్నర్లు చేస్తున్న వీడియోలు వైరల్ కావడమే ఇందుకు కారణం. టోర్నీ నుంచి వైదొలిగారుగా.. వెళ్లి షాపింగ్స్, డిన్నర్లు చేసుకోండి అంటూ పాకిస్థాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్ ప్లేయర్ నిదా దార్‌తో పాటు సహచరులు, అలాగే ఆలియా రియాజ్ ఆమె భర్త అలీ యూనిస్ (మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ తమ్ముడు) లతో కలిసి ఉన్న దృశ్యాలపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై పాక్ పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ మాట్లాడుతూ.. “ఐసీసీ టోర్నీల్లో మహిళల జట్టు ప్రదర్శన ఏమాత్రం మెరుగుపడకపోవడం ఆశ్చర్యకరం” అని అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ కోచ్ కబీర్ ఖాన్ స్పందిస్తూ.. “ఆటగాళ్లకు అంతర్జాతీయ ఎక్స్పోజర్ లేదా వసతుల కొరత లేదు. కానీ, వారు మానసికంగా ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు” అని విమర్శించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా

మరోవైపు.. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆలియా రియాజ్ మైదానంలో పడుకుని ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై కొందరు అభిమానులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. జట్టు ఓడిపోయినప్పుడు సాంకేతిక లోపాలను విమర్శించడం సహజమే కానీ, క్రీడాకారిణుల వ్యక్తిగత విషయాలను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిరంతర ఓటములు ఇలాగే కొనసాగితే పాకిస్తాన్లో మహిళల క్రికెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని మాజీలు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..