Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
- బాల్కొండలో దూకుడుగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు..
- అక్కడేం జరుగుతోందంటూ సీఎంవో ఆరా తీసిందా?..
- ఫోకస్ పెట్టమని అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారా?..
- దూకుడుగా విపక్ష ఎమ్మెల్యే, వర్గపోరుతో అధికార పక్షం సతమతం..
- పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ స్వగ్రామం ఇదే నియోజకవర్గంలో..
- సోషల్ మీడియాకే పరిమితమైన స్థానిక కాంగ్రెస్ నేతలు...
- డీసీసీ నుంచి తప్పించాక కామ్‌గా మానాల మోహన్‌రెడ్డి..
- విపక్ష ఎమ్మెల్యేకి ప్లస్ అవుతున్న అధికార పార్టీలోని వర్గపోరు...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. ప్రస్తుతం జిల్లాలో పార్టీకి కూడా ఆయనే పెద్దదిక్కు. బాల్కొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రశాంత్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ద్వితీయ శ్రేణి నేతలను సమన్వయం చేస్తూ…. కేడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారన్నది పార్టీ టాక్. ధాన్యం కొనుగోళ్ళలో జాప్యం జరుగుతోందంటూ ఇటీవల జిల్లాలో నిర్వహించిన ఆందోళనలకు సక్సెట్ టాక్ వచ్చింది. దీంతో….అక్కడేం జరుగుతోందంటూ ముఖ్యమంత్రి కార్యాలయం సైతం ఆరా తీసినట్టు చెప్పుకుంటున్నారు. అంతటితో ఆగకుండా…అధికార పార్టీ పెద్దలు బాల్కొండ నియోజకవర్గంపై ఫోకస్ చేసినట్టు తెలిసింది. ప్రతిపక్షంలో ఉన్న ఆ ఎమ్మెల్యేకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వొద్దంటూ తమ స్థానిక నేతల్ని ఆదేశించినట్టు తెలిసింది. ఇటు అధికారులకు సైతం బాల్కొండ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలంటూ సీఎంవో నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ రకంగా ప్రశాంత్ రెడ్డి దూకుడుకు కళ్లెం వేయాలని అధికార పార్టీ భావిస్తుంటే.. ఆయన మాత్రం తగ్గేదేలే అంటున్నారట.
తాజాగా యూరియా యాప్‌పై నియోజకవర్గం మొత్తం ఆందోళనలు జరిగాయి. ఆ పేరుతో రైతులను ఏకం చేసేందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలు అధికార పార్టీకి మింగుడుపడ్డంలేదని అంటున్నారు. ఓవైపు బాల్కొండలో బీఆర్ఎస్ బలంగా ఉండటంతో పాటు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తుంటే….మరోవైపు అధికార పార్టీలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందట. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఓ గ్రూపుగా, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డిది మరో గ్రూప్‌గా ఉంది. పీసీసీ అధ్యక్షుడు మహష్ కుమార్ గౌడ్ స్వగ్రామం కూడా ఇదే నియోజకవర్గంలో ఉండటంతో ఆయనకు బాల్కొండ కీలకంగా మారిందని అంటున్నారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికలను పీసీసీ ఛీఫ్ ఛాలెంజ్ గా తీసుకుని ఇక్కడి భీంగల్ మున్సిపాలిటీని చేజిక్కుంచున్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య పోరు ఉన్నా.. నేతలను సమన్వయం చేసి.. భీంగల్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగురేయగలిగారు. ఇదే స్పూర్తితో.. వచ్చే ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారట. ప్రశాంత్ రెడ్డికి అవకాశం ఇవ్వొద్దంటూ గట్టిగా చెప్పినట్టు తెలిసింది.
Also Read
కానీ…. స్థానిక నాయకులు మాత్రం సోషల్ మీడియాకే పరిమితమై మమ అనిపిస్తున్నట్టు చెబుతున్నారు. డీసీసీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో ప్రశాంత్ రెడ్డికి గట్టి కౌంటర్స్ ఇస్తూ.. ప్రత్యామ్నయం నేనే అనేలా దూకుడుగా వ్యవహరించిన మానాల మోహన్ రెడ్డి ఆ పదవి నుంచి తప్పించాక తన పని తాను చేసుకుపోతున్నారు. ఇటు భీంగల్ మున్సిపాలిటీ చేజారడం మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి మింగుడు పడలేదట. కానీ పోయిన చోటే వెతుక్కోవాలంటూ నియోజకవర్గం చుట్టొస్తూ మరింత పట్టు పెంచుకునే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీలోని వర్గపోరు ఆయనకు కలిసి వస్తోందట. ఈ పరిస్థితుల్లో సొంత పార్టీని చక్కదిద్దడంతోపాటు విపక్ష ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు స్వయంగా పీసీసీ చీఫ్ రంగంలో దిగుతారా.. ఇన్ఛార్జ్ని మారుస్తారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు స్థానిక కార్యకర్తలు.
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!