CRIME: 7 నెలల గర్భంతో ఉన్న ప్రియురాలిని చంపేసిన సలీమ్..
- 7 నెలల గర్భిణిని చంపిన ప్రియుడు..
- పెళ్లి చేసుకోవాలని కోరడంతో హత్య..
- ఢిల్లీలో దారుణ ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CRIME: ఢిల్లీకి చెందిన గర్భిణీ యువతిని అత్యంత దారుణంగా హత్య చేశాడు ఆమె లవర్. హర్యానలోని రోహ్‌తక్‌లో ఆమె ప్రియుడు, మరో ఇద్దరు కలిసి హత్య చేసి పూడ్చిపెట్టారు. పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఆమెను అబార్షన్ చేయించుకోవాలని ప్రియుడు ఒత్తిడి తెచ్చినప్పటికీ యువతి వినలేదు. దీంతోనే ఈ హత్యకు పాల్పడ్డాడు.
పశ్చిమ డిల్లీలోని నాంగ్లోయ్‌కి చెందిన 19 ఏళ్ల సోనియా అనే యువతి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది. ఆమెకు 6 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ప్రియుడు సంజు అకా సలీమ్‌తో కలిసి ఉన్న ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హర్యానాలోని రోహ్‌తక్‌లో ఓ పొలంలో ఆమె మృతదేహాన్ని తవ్వి పాతిపెట్టాడు.
Also Read
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
- Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
Read Also: Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేసిన వ్యక్తిపై దాడి?(వీడియో)
ఏడు నెలల గర్భిణి అయిన సోనియా, సలీమ్‌ని పెళ్లి చేసుకోవాలని కోరిందని పోలీసులు తెలిపారు. అయితే, అతను గర్భాన్ని తీయించుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు సోనియా ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. సోమవారం ఆమె తన ఇంటి నుంచి కొన్ని వస్తువులు తీసుకుని సలీమ్‌ని కలిసేందుకు వెళ్లింది. ఆ తర్వాత సలీమ్, సోనియాను హత్య చేశాడు.
సోనియా కనిపించకుండా పోవడంతో అక్టోబర్ 23న ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యలో తన స్నేహితులు రితిక్, పంకజ్ పాల్గొన్నట్లు నిందితుడు సలీమ్ చెప్పాడు. కర్వా చౌత్ రోజే ఈ హత్య జరిగింది. సోనియాని నిందితులు నంగ్లోయ్ ప్రాంతంలో కలుసుకున్నారు. ఆ తర్వాత కారులో రోహ్‌తక్ వెళ్లారు. అక్కడ ఆమె గొంతు కోసి చంపేసి, ఆ రాత్రి తర్వాత ఢిల్లీకి తిరిగి వచ్చారు. రోహ్‌తక్ అడవుల్లో ఆమె మృతదేహాన్ని పాతిపెట్టారు. సలీమ్‌తో పాటు అతడికి సహకరించిన వారిలో ఒకరిని అరెస్ట్ చేశారు, మరొకరు పరారీలో ఉన్నారు.
తాజావార్తలు
-
Gold Price Today: శ్రావణ మాసం వేళ గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఢమాల్.. 24K, 22K రేట్లు ఇవే
-
PM Modi: విభజన నాటి విషాదాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ.. బాధితుల ధైర్యానికి ప్రశంసలు..
-
IND vs SL 1st Test: టీమిండియా ప్లేయింగ్ 11పై కోచ్ కీలక హింట్.. బెంచ్‌లోనే ఆ నలుగురు!
-
Sankranti Box Office Clash : అందరికీ సంక్రాంతే కావాలి.. సినిమా పట్టాలెక్కకముందే పండగ రేసుపై కర్చీఫ్
-
విరాట్ కోహ్లీ వాడే ‘హూప్’ కి పోటీగా Google Fitbit Air.. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!