Constable Rape: అతడొక బాధ్యతాయుతమైన పోలీస్ కానిస్టేబుల్. ప్రజలను కాపాడడమే అతని పని. కానీ అతడు ఆ బాధ్యతను మరిచాడు. రోడ్డు మీద అమ్మాయి ఒంటరిగా కనిపించడంతో మృగాడిలా మారిపోయాడు. తానొక కానిస్టేబుల్ అన్న విషయాన్ని కూడా మరిచి ఆమెపై అత్యాచారయత్నానికి తెగబడ్డాడు. ఈ దారుణ ఘటన పుదుచ్చేరి లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. హైదరాబాద్ కు చెందిన మెడికోలు విద్యార్థిని(21) ఒకరు.. జిప్మర్ లో ప్రసిద్ధ మెడికల్ కాలేజీలో జరిగే సదస్సుకు హాజరయ్యింది. స్నేహితులతో పాటు ఆమె పక్కనే ఉన్న హోటల్ లో బస చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం కూడా సదస్సు ముగించుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. అక్కడికి కన్నన్ అనే పోలీస్ కానిస్టేబుల్, అతని స్నేహితుడు శివన్ ఆమెను చూశారు.
ఒంటరిగా నడుచుకు వెళ్తున్న యువతిని ఇద్దరు బలవంతంగా ఎత్తుకెళ్ళి నిర్మానుష్య ప్రదేశంలో ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశారు. ఇక సదస్సులో ఆమెతో పాటు ఉన్న స్నేహితులు యువతీ ఇంకా రూమ్ కు రాకపోవడంతో వెతకడానికి కాలేజ్ కు వెళ్తుండగా మార్గ మద్యంలో యువతిపై అత్యాచారం చేస్తూ కామాంధులు కనిపించారు. వెంటనే వారు కేకలు వేయగా అక్కడినుంచి నిందితులు పారిపోయారు. వెంటనే యువతిని వైద్య చికిత్స కోసం జిప్మర్ కు తరలించారు. ఇక ఈ ఘటనపై యువతి పుదుచ్చేరి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించి కన్నన్, శివన్ ను గుర్తించారు. పరారీలో ఉన్న వారిని తాజాగా పట్టుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.