బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించిన పేర్ని నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు పడి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మృతిచెందిన వారిలో డ్రైవర్‌తో పాటు 6 గురు మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన సమాచారం అందటంతోనే పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు వచ్చేలోపే స్థానికులు పడవల సహాయంతో బాధితులు ఒడ్డుకు చేర్చారు. అయితే ఈ ప్రమాదంతో కొంత మంది గల్లంతయ్యారు. వారికోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.
అంతేకాకుండా ఈ ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన చికిత్స అందిచాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై మంత్రి పేర్ని నాని విచారణకు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక అందించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ప్రమాదంలో గాయపడినవారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు.
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!