Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thick Milk Cream: పాలను మరిగించిన తర్వాత పైభాగంలో ఏర్పడే మీగడను చాలామంది ఇళ్లలో ప్రత్యేకంగా సేకరిస్తుంటారు. ఈ మీగడతో వెన్న, నెయ్యి తయారు చేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు మంచి పాలు ఉపయోగించినా పైభాగంలో పలుచని మీగడ తక్కువగా మాత్రమే ఏర్పడుతుంది. అయితే పాలలో ఏదైనా కలిపితే మందమైన మీగడ వస్తుందని అనుకోవడం తప్పు. నిజానికి పాలను మరిగించే విధానం, ఆ తర్వాత చల్లబరిచే విధానం కూడా మీగడ ఎంత మందంగా ఏర్పడుతుందనే దానిపై ప్రభావం చూపుతాయి. మరి ఆ విశేషాలేంటో చూసేద్దామా మరి..
1-5-6 ఫార్ములా
ఈ మధ్య కాలంలో మందపాటి మీగడ కోసం ‘156 ఫార్ములా’ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో 1 గంట, 5 గంటలు, 6 గంటలు అనే మూడు దశలు ఉంటాయి. అంటే ముందుగా పాలను బాగా మరిగించి గంటపాటు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. ఆ తర్వాత మరో 5 గంటలు అలాగే ఉంచి, చివరగా 6 గంటల పాటు ఫ్రిజ్లో పెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల పాల పై భాగంలో బాగా మందమైన మీగడ పొర ఏర్పడటానికి సహాయపడుతుంది.
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
పాలను బాగా మరిగించాలి
మందమైన మీగడ కోసం ముందుగా పాలను మందపాటి అడుగు ఉన్న పాత్రలో పోసి బాగా మరిగించాలి. పాలు పైకి పొంగే స్థాయికి చేరుకుని, అంచుల వద్ద నురుగు, బుడగలు కనిపించే వరకు వేడి చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సుమారు గంటపాటు చల్లారనివ్వాలి. ఈ సమయంలో పాత్ర పై ఎలాంటి మూతపెట్టకుండా ఉంచాలి.
5 గంటలు అలాగే ఉంచాలి
గంట తర్వాత పాలను మరో 5 గంటల పాటు అలాగే ఉంచాలి. ఈ సమయంలో పాత్రను పూర్తిగా గాలి చొరబడకుండా మూసివేయకూడదు. పాత్రను సగం లేదా మూడు వంతుల వరకు మూతపెట్టి, కొంత భాగం తెరిచి ఉంచాలి. ఇలా చేయడం ద్వారా పాత్రలో అధిక తేమ పేరుకుపోకుండా ఉంటుంది. ఎక్కువ తేమ ఉంటే మీగడ పొర సరిగ్గా ఏర్పడటానికి ఇబ్బంది కలగవచ్చు.
ఫ్రిజ్లో పెట్టాలి
ఇక చివరి దశలో పాల పాత్రను సుమారు 6 గంటల పాటు ఫ్రిజ్లో ఉంచాలి. కావాలంటే రాత్రంతా కూడా ఫ్రిజ్లో ఉంచుకోవచ్చు. పాలు పూర్తిగా చల్లబడిన తర్వాత పైభాగంలో మందమైన మీగడ పొర ఏర్పడే అవకాశం ఉంటుంది. మీగడను తీసేటప్పుడు ముందుగా పాత్ర అంచుల వద్ద చంచా లేదా కత్తితో మెల్లగా వేరు చేసి, ఆ తర్వాత గరిటెతో తీయాలి.
ఎలాంటి పాలు వాడాలి?
మీగడ ఎంత వస్తుందనేది కేవలం పద్ధతిపైనే ఆధారపడి ఉండదు. పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటే మీగడ కూడా ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్యాకెట్ పాలను ఉపయోగించేవారు ఫుల్ క్రీమ్ పాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో తరచుగా మీగడ సేకరించి వెన్న లేదా నెయ్యి తయారు చేసుకునేవారికి ఈ పద్ధతి ఉపయోగకరంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు