Witchcraft: ఒడిశా గజపతి జిల్లాలో క్షుద్ర విద్య, చేతబడి చేస్తు్న్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని గ్రామస్తులు దారుణంగా హత్య చేశారు. 35 ఏళ్ల వ్యక్తిని చంపి, అతడి ప్రైవేట్ భాగాలు ముక్కలు చేసి, సమీపంలోని హరభంగి డ్యామ్‌లో పారేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. గ్రామస్తులు వ్యక్తి గొంతు కోసం చంపిన తర్వాత, అతడి జననేంద్రియాలు కత్తిరించి, మృతదేహాన్ని జలాశయంలో పారేశారు. పోలీసులు డెడ్‌బాడీని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపారు.
Read Also: Tollywood : లిక్కర్ స్కాం నిందితుడు వెంకటేష్ నాయుడుతో స్పెషల్ జెట్ లో తమన్నా..
రెండు వారాల క్రితం గ్రామంలో ఒక మహిళ మరణానికి ఇతను కారణమని గ్రామస్తులు అనుమానించారు. మోహన పోలీస్ స్టేషన్ పరిధిలోని మలసపదర్ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనతో సంబంధం ఉన్న 14 మంది గ్రామస్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. స్థానికుల నుంచి బెదిరింపులు రావడంతో మృతుడు, తన కుటుంబంతో కలిసి గంజాం జిల్లాలోని తన మామ ఇంటికి వెళ్లాడు. తన పశువులను చూసుకోవాలని తన వదినను కోరారు. శనివారం తన పశువులు, మేకల్ని తీసుకెళ్లడానికి గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు అతడిని అపహరించి చంపారు.