Biker Glimpse: అదిరిపోయిన శర్వానంద్ ‘బైకర్’ గ్లింప్స్.. ‘బుల్లెట్ సునీల్’గా రాజశేఖర్ మాస్ ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’. ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి జిబ్రాన్ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ మేకర్స్ ఒక చిన్న గ్లింప్స్‌ను వదిలారు. ఇందులో,
Also Read : Ram Charan-Upasana : మెగా కవలల రాకతో ‘స్పెషల్’ ట్రీట్.. రామ్ చరణ్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌లో ఏముందంటే?
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
- Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
రాజశేఖర్ ‘బుల్లెట్ సునీల్’ అనే మాజీ మోటోక్రాస్ రేసర్‌గా కనిపిస్తున్నారు. భారతీయ రేసర్లు అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్ గెలవాలనే లక్ష్యంతో పనిచేసే ఒక పవర్‌ఫుల్ మెంటార్ పాత్రలో రాజశేఖర్ అదరగొట్టబోతున్నారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే రాజశేఖర్ నటన సినిమాకే హైలైట్ అవుతుందనిపిస్తోంది. యాక్షన్, ఎనర్జీతో కూడిన ఈ వీడియో సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. శర్వానంద్ – రాజశేఖర్ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ రేసింగ్ డ్రామా శర్వానంద్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
-
BeiGo X4: 100KM రేంజ్‌తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
-
AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!