Cattle Smuggling: పశువుల అక్రమ రవాణా 40 మంది ముఠా ఆట కట్టించిన పోలీసులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cattle Smuggling: పశువుల అక్రమ రవాణా కేసులో అంతరాష్ట్ర ముఠా ఆటకట్టించారు పోలీసులు. రాత్రి రాత్రే మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ఎత్తుకెళ్లే ముఠా పోలీసులకు చిక్కింది. తెలంగాణలో చోరీ చేసి మహరాష్ట్రలో మాంసంగా విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. కానీ, ఈ అంతర్రాష్ట్ర ముఠా ఆగడాలకు చెక్ పెట్టారు నిర్మల్ పోలీసులు. ఈ ముఠా నాయకుడు నాందేడ్‌కు చెందిన సయ్యద్ సోహెల్. ఇతను దాదాపు 40 మందితో ముఠా ఏర్పాటు చేశాడు. అర్థరాత్రి రోడ్ల మీద ఉండే ఆవులు, ఎద్దులే ఈ ముఠా టార్గెట్. ఇందుకోసం ఖరీదైన కార్లను వాడుతున్నారు. అంతే కాదు ఆవులను కారులోకి ఎక్కించేందుకు వీలుగా వాటిలో డ్రైవర్ సీట్ మినహా మిగతా సీట్లన్నీ తీసివేశారు. ఇందుకోసం నాందేడ్‌లో పెద్ద గ్యారేజ్ కూడా ఏర్పాటు చేశారు.
Red Sandalwood smuggling: కర్ణాటక పుష్ప.. ఆగని ఎర్ర చందనం స్మగ్లింగ్ దందా!
Also Read
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
అర్ధరాత్రి రోడ్లపై పశువుల కోసం తిరిగే ఈ ముఠా సభ్యులు. ఆవులు, ఎద్దులు కనిపించగానే వాటి వద్దకు వెళ్తారు. మెల్లగా వాటికి మత్తు ఇంజక్షన్ ఇస్తారు. ఆవులు కాస్త మత్తులోకి జారుకోగానే వాటిని అమాంతం కార్లలో ఎక్కించేస్తారు. అక్కడి నుంచి ఉడాయిస్తారు. అలా తీసుకు వెళ్లిన ఆవులను మహారాష్ట్రలో మాంసంగా విక్రయిస్తున్నారు ఈ కేటుగాళ్లు. ఐతే వీరు ఆవులను దొంగతనం చేసేటప్పుడు సీసీ కెమెరాల్లో విజువల్స్ రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు ఛేదించారు. వీరి ఆట కట్టించారు. ఈ కేసులో తొలుత ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద సమాచారం సేకరించి మరో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
POCSO: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నల్లగొండ కోర్టు సంచలన తీర్పు..
రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా వద్ద ఈ ఏడుగురు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బైంసాకు చెందిన షేక్ ఉమెర్ ఈ ముఠాకి సహకరించాడు. అతనిని, ఖులీద్‌ను బైంసాలోనే అరెస్టు చేయగా నాందేడ్‌కు చెందిన రాజు, బైంసాకు చెందిన తయూబ్ పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద రెండు వాహనాలు, 8 మొబైల్ ఫోన్లు, 4 లక్షల 39 వేల 280 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. పశువులు, గోవుల అక్రమ రవాణా చట్టరీత్యా నేరం.. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలిపారు.
తాజావార్తలు
-
Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్‌పై కుక్క అటాక్! చివరి క్షణంలో.. వీడియో వైరల్!
-
Niharika Konidela: బంగారు బోనం ఎత్తిన నిహారిక కొణిదెల.. పాతబస్తీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!
-
Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
-
Donald Trump: ‘మీరు వైట్ హౌస్ యజమాని కాదు’.. ట్రంప్‌కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
-
Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!