పెళ్లై రెండు నెలలు కూడా కాలేదు…!! భర్త వేధిస్తున్నాడని భార్య హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది ! లక్కీగా స్థానికులు కాపాడారు. ప్రాణాలతో బయటపడింది. హమ్మయ్య అనుకునేలోపు.. భార్య కేసు పెట్టిందని భర్త హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హ్యాపీగా సంసారం చేసుకోవాల్సిన జంట.. సాగర్ లో ఎందుకు దూకింది. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిందెవరు..?
చూడముచ్చటగా ఉన్న ఈ జంటకు రెండు నెలల క్రితమే వివాహమైంది. రాంనగర్ పరిధిలోని బహదూర్‌నగర్‌కి చెందిన మంగమ్మ, బాబురావు కుమారుడు సంతోష్‌కి… రామాంతపూర్‌కి చెందిన శారదతో మే 9న వివాహం అయ్యింది. పెళ్లైన కొత్తలో ఇద్దరూ బాగానే ఉన్నారు. కానీ.. నెల రోజులుగా సంతోష్, శారద మధ్య మనస్పర్థలు వచ్చాయి. సంతోష్ శారదను దూరం పెడుతూ వచ్చాడు. తట్టుకోలేని శారద… హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు గమనించి శారదను కాపాడారు. ప్రాణాపాయం తప్పింది. శారదను కుటుంబ సభ్యులకు అప్పగించారు..
Read More: TTD AEO Suspended: టీటీడీ ఏఈవో రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు..
శారద ఆత్మహత్యాయత్నంతో షాక్ ఐన ఆమె కుటుంబ సభ్యులు.. సంతోష్ ఇంటి వద్ద పంచాయతీ పెట్టారు. ఈసారి సంతోష్ రివర్స్‌లో షాక్ ఇచ్చాడు. శారద హెల్త్ కండిషన్ ఏమాత్రం బాగుండటం లేదని… మానసికంగానూ ప్రవర్తన సరిగ్గా ఉండటం లేదని చెప్పాడు. ఆస్పత్రికి తీసుకెళ్లానని… గైనిక్‌తో పాటు.. అనారోగ్య సమస్యలున్నాయని డాక్టర్లు చెప్పారంటున్నాడు సంతోష్. ఇవన్నీ దాచిపెట్టే తనకు పెళ్లి చేశారని.. తనకు అన్యాయం చేశారని… శారద తనకు వద్దని తెగేసి చెప్పేశాడు సంతోష్.. సంతోష్ తీరుతో పోలీసులను ఆశ్రయించారు శారద కుటుంబసభ్యులు. సంతోష్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను పెళ్లి చేసుకున్నావ్ కాబట్టి ఆమె బాగోగులు నువ్వే చూసుకోవాలని… ఆస్పత్రిలో చూపించి నయం చేయించాలని సూచించారు పోలీసులు. ఇదే అదునుగా బంధువులు కూడా సంతోష్‌పై ఒత్తిడి పెంచారు. శారదతో సంసారం చేయకపోతే… మీ కుటుంబం మొత్తాన్ని జైలుకు పంపేదాకా వదలమని హెచ్చరించారు శారద కుటుంబసభ్యులు…
Read More: Telangana Cabinet: జులై 10న తెలంగాణ కేబినెట్ భేటీ.. ఈసారి ప్రత్యేకత ఏంటో తెలుసా?
అనారోగ్యంతో ఉన్న ఆమెను తనకు అన్యాయంగా అంటగట్టారని… ఆపై కేసు కూడా పెట్టారని మనస్థాపానికి లోనైన సంతోష్ కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. హుసేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సంతోష్ మృతికి భార్య శారదతో పాటు అత్తమామ, మేనమామలు ఇందిర, వెంకటేష్, కె.సాయినాథ్, యాదగిరి, మహేశ్వరి, వరలక్ష్మి కారణం అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సంతోష్ కుటుంబసభ్యులు… హబ్సీగూడలోని ఐఐసీటీలో సంతోష్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేస్తూనే… రాత్రి వేళల్లో పబ్‌లు, రెస్టారెంట్ల వద్ద బౌన్సర్‌గా కూడా పనిచేస్తున్నాడు సంతోష్. అతనికి మద్దతుగా నిలుస్తున్నారు కాలనీవాసులు, స్నేహితులు. జస్టిస్ ఫర్ సంతోష్ అంటూ ఫ్లెక్సీలు పెట్టారు స్నేహితులు. భార్య శారదతోపాటు వాళ్ల కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..
