Madanapalle Files Burning Case: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైల్స్ దగ్ధం కేసులో మదనపల్లె మాజీ ఆర్డీవో మురళిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత పరార్ అయిన మురళి కోసం మదనపల్లి, తిరుపతి, హైదరాబాద్ లో అధికారులు గాలించారు. ఇక, తిరుపతిలోని కేఆర్ నగర్ లో ఉన్నట్లు తెలుసుకొని వెళ్లిన అతడ్ని సీఐడీ డీఎస్పీ డీవీ వేణుగోపాల్ బృందం అరెస్టు చేసింది.
Read Also: TTD AEO Suspended: టీటీడీ ఏఈవో రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు..
అయితే, ఆర్డీవో మురళి ముందస్తు బయలు కోసం హైకోర్టుకు దరఖాస్తు చేయగా రిజెక్ట్ అయింది. ఇక, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిలుకు దరఖాస్తు చేసుకోవడంతో అరెస్టు అనంతరం బెయిలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లు డీఎస్పీ వెల్లడించారు. సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం మురళిని అరెస్టు చేసి బెయిల్ పై విడుదల చేసినట్లు తెలిపిన సీఐడీ అధికారులు వెల్లడించారు.