ఛీఛీ దానికోసం.. మహిళను 16 నెలలు బంధించి.. రేప్ చేస్తూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిల్లలు కావాలని ప్రతి జంట ఆశపడుతోంది. భార్యాభర్తల బంధం నుంచి తల్లిదండ్రులుగా మారాలని కోరుకుంటారు. పిల్లల కోసం పూజలు, వ్రతాలూ చేస్తారు. పుట్టకపోతే చిన్నారులను దత్తత తీసుకుంటారు. ఇక్కడి వరకు ఓకే.. కానీ, ఇక్కడ ఒక జంట పిల్లల కోసం దారుణానికి పాల్పడింది. పిల్లల కోసం ఒక మహిళను 16 నెలలు బంధించి చిత్రహింసలు పెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. ఉజ్జయినీలోని కధ్ బరోడా గ్రామ మాజీ ఉప సర్పంచ్ రాజ్‌పాల్ సింగ్ కి కొన్నేళ్ల క్రితం ఒక మహిళతో వివాహమైంది.. వారికి ఇద్దరు పిల్లలు. ఎంతో సంతోషంగా ఉండే వారి జీవితంలో విషాదం నిండుకుంది. ఇద్దరు పిల్లలు అనారోగ్యం కారణంగా మృతిచెందారు. దీంతో వారు ఒంటరైపోయారు. ఎలాగైనా తమకు పిల్లలు కావాలని ఒక దారుణమైన పని చేశారు. రాజ్‌పాల్ సింగ్ మధ్యవర్తుల సాయంతో 16 నెలల కిందట ఓ మహిళను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చాడు.
Also Read
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
భార్య సహాయంతో ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసి, బిడ్డను కనాలని బలవంతం చేశారు. 9 నెలల క్రితం ఆ మహిళ గర్భవతి అయ్యి.. ఇటీవల ఒక బిడ్డను ప్రసవించింది. బిడ్డను ప్రసవించిన తరువాత స్పృహలేని ఆమెను బస్టాండ్‌లో వదిలి పరారయ్యాడు. స్పృహలోకి వచ్చిన మహిళ తన బిడ్డ కావాలని పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!