Crime: మైనర్ బాలికలపై అత్యాచారం.. ఒకరిని నమ్మించి, మరొకరిని అపహరించి..
- మైనర్ బాలికపై అత్యాచారం..
- పెళ్లి పేరుతో నమ్మించి.. మరొకరిని అపహరించి అఘాయిత్యం..
- రాజస్థాన్.. మహారాష్ట్రలో ఘటనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: మహిళలు, బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. దేశంలో ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మహారాష్ట్ర థానే జిల్లాలో 13 ఏళ్ల మైనర్ బాలికపై 28 ఏళ్ల నిందితుడు పదే పదే అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. భివాండిలోని న్యూ ఆజాద్ నగర్ ప్రాంతానికి చెందిన నిందితుడి పొరుగింటిలోనే బాలిక ఉండేది.
బాలికతో పాటు బాలిక కుటుంబంతో నిందితుడు స్నేహం చేస్తూ నమ్మించాడు. బాలిక కుటుంబ సభ్యులు తరుచూ ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి బలవంతంగా బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ లైంగిక వేధింపులు మేలో ప్రారంభమయ్యాయి. అయితే సోమవారం ఇదే విధంగా చేయడానికి ప్రయత్నించిన సమయంలో బాలిక అందుకు అడ్డు చెప్పింది. దీంతో నిందితుడు ఆమెను కొట్టి బెదిరించినట్లు అధికారులు తెలిపారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై భారతీయ న్యాయ సంహిత మరియు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
Read Also: Andhra Pradesh: బీజేపీలో నామినేటెడ్ పదవులపై చర్చ.. ప్రతిపాదనలో వారి పేర్లు!
రాజస్థాన్లో 15 ఏళ్ల బాలిక గ్యాంగ్ రేప్:
జోధ్పూర్లో ఇంటి నుంచి తప్పిపోయిన 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రి వెనక ఉన్న డంప్ యార్డ్లో ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఆదివారం రాత్రి బాలిక మహాత్మా గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి చేరుకోగానే ఆమెపై అత్యాచారం జరిగినట్లు జోధ్పూర్ సిటీ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితుల్ని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అత్యాచార ఘటనపై మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పి్స్తున్నారు.
తాజావార్తలు
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..