West Bengal: బెంగాల్‌లో మరో దారుణం.. ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న బాలికపై అత్యాచారం..
- వైద్యురాలి ఘటన మరవక ముందే బెంగాల్‌లో మరో దారుణం..
- ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న బాలికపై అత్యాచారం..
- కారులో ఎక్కించుకుని అఘాయిత్యం..
- ఘటనను మభ్యపెట్టేందుకు పోలీసులు చర్యలని బీజేపీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: కోల్‌కతాలో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ సర్కార్, మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. ప్రజలు ఇప్పటికీ అక్కడ ఆందోళనలు, నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం, కోల్‌కతా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించాయని ఆరోపిస్తూ , కలకత్తా హైకోర్టు కేసుని సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే, ఆర్ జీ కర్ సంఘటన మరవక ముందే బెంగాల్‌లో మరో ఘోరం జరిగింది. హుగ్లీలో ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న 15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. కారులో ఎక్కించుకుని అత్యాచారం చేసిన నిందితులు, ఆమెను అపస్మారకస్థితిలో రోడ్డు పక్కన పడేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. మైనర్ బాలిక హుగ్లీ జిల్లాలోని హరిపాల్ వద్ద చిరిగిన బట్టలతో అపస్మారస్థితిలో కనిపించింది. బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో ఆమెను కారులో ఎక్కించుకున్నారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
Read Also: Uruku Patela Review: ఉరుకు పటేలా రివ్యూ.. థియేటర్లకు ఉరుకులు పెట్టించేలా ఉందా? లేదా?
బాలికను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్నారు. దీనిపై బెంగాల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ‘‘మెడికో లీగల్ ఒపీనియన్‌తో సహా ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో అనుమానితులను గుర్తించలేదు’’అని బెంగాల్ పోలీసులు ట్వీట్ చేశారు. బాలిక, ఆమె కుటుంబ గోప్యతను గౌరవించాలని అభ్యర్థించారు. పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే, ఈ ఘటనపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఆస్పత్రిని సీజ్ చేసి, మీడియాకు ప్రవేశాన్ని నిరాకరించారని, ఘటనను కప్పిపుచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ‘‘మమతా బెనర్జీ పోలీసులు ఆసుపత్రిని చుట్టుముట్టారు, మీడియాకు ప్రవేశం లేదు మరియు స్థానిక టిఎంసి నాయకులు ఈ సంఘటన గురించి నివేదించబడకుండా చూసేందుకు చుట్టూ తిరుగుతున్నారు’’ అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా అన్నారు. పశ్చిమ బెంగాల్ మహిళలకు అత్యంత ‘‘అసురక్షిత ప్రాంతం’’గా ఉందని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!