West Bengal: కోల్‌కతాలో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ సర్కార్, మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. ప్రజలు ఇప్పటికీ అక్కడ ఆందోళనలు, నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం, కోల్‌కతా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించాయని ఆరోపిస్తూ , కలకత్తా హైకోర్టు కేసుని సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే.…