Meerpet : సీజ్ చేసిన ఫోన్, బంగారాన్ని కాజేసిన కానిస్టేబుల్ అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రక్షించాల్సిన రక్షక భటుడే భక్షకుడిగా మారిన ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్లో వెలుగుచూసింది. ఓ కేసు దర్యాప్తులో భాగంగా సీజ్ చేసిన మొబైల్ ఫోన్, రికవరీ చేసిన బంగారాన్ని కాజేసిన కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్‌పై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
సీజ్డ్ సొత్తుపై కన్నేసి..
వివరాల్లోకి వెళితే.. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రవణ్ కుమార్, గతంలో ఓ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న సొత్తుపై కన్నేశాడు. ఆ కేసులో సీజ్ చేసిన నిందితుడి మొబైల్ ఫోన్‌ను దుర్వినియోగం చేస్తూ, ఆన్లైన్ ద్వారా ఏకంగా రూ.1,70,000 (లక్షా డెబ్బై వేల రూపాయలను) తన బంధువుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసుకున్నాడు.
Also Read
- Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!
- Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం... అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
- Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
- Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..
12 తులాల బంగారం తాకట్టు
అంతటితో ఆగకుండా, అదే కేసులో పోలీసులు స్వాధీనం చేసుకుని భద్రపరిచిన 12 తులాల బంగారు ఆభరణాలను సైతం గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులు/సంస్థల వద్ద తాకట్టు పెట్టి నగదు తీసుకున్నాడు. ఈ అవకతవకలు బయటపడటంతో స్టేషన్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ చేతివాటం బట్టబయలు కావడంతో అతనిపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. విధి నిర్వహణలో ఉంటూ ఇలాంటి అక్రమాలకు పాల్పడటం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!
-
Big Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి ముంచుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు..
-
Rajasthan: 40 విల్లాలు, కాటేజీలు.. IAS-IPS దంపతుల అవినీతి బాగోతం..
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డులు.. భారత క్రికెట్లో మరో కొత్త చర్చ..
-
I Am Game: జియోహాట్‌స్టార్‌లోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!