రామచంద్రాపురం అమీన్ పూర్ విషాదం చోటుచేసుకుంది. చీమలకు భయపడి.. ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Read Also: Colourful Snake: రంగురంగులుగా, అందంగా కనిపించే పాము.. దగ్గరికెళ్లారో డేంజరే..
పూర్తి వివరాల్లోకి వెళితే.. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో నవ్య కాలనీలో నివాసముంటున్న మనీషా (25) చీమలకు భయపడి చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 2022 లో మృతురాలు మనీషా కు చిందం శ్రీకాంత్ (35) తో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల పాప అనికా ఉంది. మంచిర్యాలకు చెందిన ఈ దంపతులు రెండున్నర సంవత్సరాల కింద ఉద్యోగ నిమిత్తం అమీన్ పూర్ లోని నవ్య కాలనీ లో నివాసముంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చకు దారితీస్తోంది.
Read Also:Serious Injury: తుమ్ము వస్తే ఆపుకుంటున్నారా.. అయితే .. బీకేర్ ఫుల్
అయితే మనీషా కు చిన్నప్పటి నుంచి చీమలకు భయపడే మైర్మెకోఫోబియా అనే వ్యాధి ఉంది. మంగళవారం ఉదయం మృతురాలు భర్త శ్రీకాంత్ ఆఫీస్ కు వెళ్ళాడు. అదే రోజు సాయంత్రం శ్రీకాంత్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగా లోపల నుంచి గడియ పెట్టి ఉంది. స్థానికుల సహాయంతో డోర్ ను పగల కొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరేసుకుని కనిపించింది. పక్కనే దొరికిన లేఖలో చీమలు భరించడం నా వల్ల కావడం లేదని అందుకే చనిపోతున్నానని అందులో పేర్కొంది. కూతురు అనికా ను జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ వదిలి వెళ్తున్నందుకు క్షమించాలని భర్తను వేడుకుంది. ఎప్పుడూ వినని సమస్యతో మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది. భర్త శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అమీన్ పూర్ సీఐ నరేష్ వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు.