Love Affair: లివింగ్ రిలేషన్స్, వివాహేతర సంబంధాలు హత్యలకు కారణమవుతున్నాయి. చాలుమాటు సంబంధాలు నేరాలతో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో చోటు చేసుకుంది. అప్పటికే పెళ్లై ఆరుగురు పిల్లలు ఉన్న వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. కేవలం 20 సెకన్ల వ్యవధిలోనే 10 సార్లు గొంతు కోసి హతమార్చాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న సమయంలో మృతురాలు రక్తపుమడుగులో పడి ఉంది. పక్కనే నిందితుడు కూడా ఉన్నాడు.
నిందితుడు 31 ఏళ్ల సోనూ వర్మకు 13 ఏళ్ల క్రితమే వివాహమైంది. ఇతనికి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నిందితుడు డీగ్ జిల్లాలోని నౌనేరా గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఇతను భరత్‌పూర్‌లోని సహయోగ్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అక్కడే ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటీవ్‌గా పనిచేస్తున్నాడు. ఇతను పూనమ్ శర్మ(21) అనే యువతితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు.
Read Also: Lokesh Kanagaraj: శృతి హాసన్‌తో లోకేష్ రొమాన్స్.. ఈ రేంజ్ లో అసలు ఊహించనేలేదే!
నిందితుడు పూనమ్ శర్మను ఈరోజు ఉదయం 10 గంటలకు గదికి తీసుకువచ్చి, 2 గంటల సమయంలో హత్యకు పాల్పడినట్లు సమాచారం. ప్రేమ వ్యవహారం ఇద్దరి మధ్య వివాదానికి కారణమైంది. దీంతో సోనూ వర్మ, పూనమ్ వర్మ గొంతు కోసి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఘటన స్థలంలో కూరగాయాలు కోసే రెండు కత్తులను, డమ్మీ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నివేదికలో కేవలం 20 సెకన్లలోనే 10 సార్లు యువతి కొంతుకోసినట్లు తేలింది. దాదాపుగా ఆమె తలను శరీరం నుంచి వేరు చేశాడు.
రెండేళ్ల క్రితం ఓ పెళ్లి వేడుకలో పూనమ్ శర్మను నిందితుడు కలిశాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పూనమ్ కోసం తాను రూ. 2.5 లక్షలు ఖర్చు చేసినట్లు నిందితుడు వెల్లడించారు. ఇటీవల ఆమె సోదరుడి వివాహం సమయంలో రూ. 50,000 ఇచ్చినట్లు విచారణలో తెలిపాడు. పూనమ్ హర్యానాకు చెందిన వేరే వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతోందని, అతడితో ప్రేమాయణం కొనసాగిస్తోందని నిందితుడు ఆరోపించారు. దీనిపై మాట్లాడేందుకే ఆమెను తన గదికి తీసుకువచ్చానని, ఆమె తన మాటలు వినేందుకు సిద్ధంగా లేకపోవడంతోనే సహనం కోల్పోయి దాడి చేశానని చెప్పాడు.