Lokesh Kanagaraj: శృతి హాసన్‌తో లోకేష్ రొమాన్స్.. ఈ రేంజ్ లో అసలు ఊహించనేలేదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
lokesh kanagaraj shruti haasan starring album song inimel Promo Goes Viral: దర్శకుడిగా తమిళ్ సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆన్-స్క్రీన్ డెబ్యూ ‘ ఇనిమెల్ సాంగ్’ ప్రోమో వీడియో విడుదలైంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద కమల్ హాసన్ నిర్మించగా ఈ పాటకు ఆయన కుమార్తె, నటి శృతి హాసన్ సంగీతం అందించారు. ఈ ప్రోమోలో చూస్తే శ్రుతి-లోకేష్ కనగరాజ్ ల కెమిస్ట్రీ బెస్ట్ గా ఉంది. ప్రేమికుల మధ్య జరిగే ఇనిమెల్ సాంగ్ ప్రోమో ఇప్పుడు బయటకు వచ్చి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పటి వరకు కేవలం డైరెక్షన్‌పైనే దృష్టి పెట్టిన లోకేష్ కనరాజ్ ఈ ఆల్బమ్ సాంగ్‌లో శృతి హాసన్‌కి జోడీగా నటించాడు. నటించాడు అనడం కంటే జీవించాడు అనొచ్చు.
Naslen Gafoor: మహేష్ బాబు,ప్రభాస్ సరసన మలయాళ కుర్ర హీరో..
Also Read
అంతలా వీరిద్దరి కెమిస్ట్రీ కనిపిస్తోంది. ఇక ఈ ఆల్బమ్ సాంగ్ మార్చి 25న ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా పాట టీజర్‌ను కమల్ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేశారు. ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే తన సినిమాలో కూడా రొమాన్స్ సీన్స్ ఎక్కవగా పెట్టని లోకేష్ ఈ ఆల్బమ్ సాంగ్ లో శృతితో రొమాన్స్ మాత్రం ఇరగదీశాడు. దీంతో ఇప్పుడు ఫుల్ ఆల్బమ్ సాంగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కమల్ కూతురు శ్రుతి హాసన్ తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో నటిస్తోంది. ఆమె చివరిగా ప్రభాస్ నటించిన సాలార్ చిత్రంలో కథానాయికగా నటించడం గమనార్హం. శృతి హాసన్ నటి మాత్రమే కాదు, గాయని అలాగే సంగీత స్వరకర్త కూడా. ఈ సందర్భంలో, కమల్ హాసన్ యొక్క రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఆల్బమ్ సాంగ్ ఇనిమెల్‌కు శృతి హాసన్ సంగీతం అందించారు. ఇక మరోపక్క లోకేష్ కనగరాజ్ ఇప్పటికే మాస్టర్, సింగపూర్ సలోన్ వంటి చిత్రాల్లో అతిధి పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఆల్బమ్ లిరిక్స్ ను నటుడు కమల్ హాసన్ రాశారని ఇప్పటికే ప్రకటించగా, ఇప్పుడు టీజర్ ను విడుదల చేసి ఈ ఆల్బమ్ సాంగ్ ను మార్చి 25న విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు.
#Inimel the game begins from 25th March.
Mark the Moment!
Streaming exclusively on https://t.co/UXpv3RSFt6#Ulaganayagan #KamalHaasan #InimelIdhuvey #Inimelat25th@ikamalhaasan @Dir_Lokesh @shrutihaasan #Mahendran @RKFI @turmericmediaTM @IamDwarkesh @bhuvangowda84 @philoedit… pic.twitter.com/LCAju1D2eq— Raaj Kamal Films International (@RKFI) March 21, 2024
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!