ప్రేమ పేరుతో యువతులపై అఘ్యాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. ప్రేమ నిరాకరిస్తే ఆమెపై యాసిడ్ పోయడం, పెట్రోల్ వేసి కాల్చడం, కత్తితో దాడి చేయడం వంటివి చేయడం ఫ్యాషన్ అయిపోయింది యువకులకు. ప్రేమ అంగీకరిస్తే ఒకటి, అంగీకరించకపోతే మరొకటి. అయితే ఓయువకుడు తన ప్రేమను నిరాకరించిన యువతిని పెట్రోలు పోసి తగలబెట్టి, ఆ యువకుడు పోలీసులకు చిక్కి నవ్వుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈవీడియో చూసిన నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. అతనేదో ఘనకార్యం చేసినట్టు ఆ నవ్వులేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఝార్ఖండ్‌లోని దుమ్కా పట్టణానికి చెందిన నిందితుడి పేరు షారూక్. ప్రేమిస్తున్నానంటూ 12వ తరగతి చదువుతున్న అమ్మాయి వెంట పడ్డాడు. అయితే.. అతడి ప్రేమను ఆమె తిరస్కరించడంతో కోపంతో రగిలిపోయిన షారూక్ ఆమెను తుదముట్టించాలని పథకం వేశాడు. దీంతో.. గత మంగళవారం ఆమె నిద్రిస్తున్న సమయంలో కిటికీ నుంచి పెట్రోలు చల్లి నిప్పంటించి పరారయ్యాడు. బాధితురాలు 90 శాతం గాయాలతో ఆసుపత్రిలో చేరిన అమ్మాయి ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. దీంతో..ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు షారూక్‌తోపాటు అతడికి పెట్రోలు అందించిన మరో యువకుడిని కూడా అదుపులోకి తీసుకుని, షారూక్ చేతులకు బేడీలు వేసిన పోలీసులు వాహనం వద్దకు తీసుకెళ్తున్న సమయంలో అతను చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. దీంతో ఆ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాలకెక్కి వైరల్ అయింది. ఒక అమ్మాయిని చంపి సిగ్గులేకుండా ఎలా నవ్వుతున్నాడని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు.. కఠిన శిక్షలు విధించాలని కామెంట్ చేస్తున్నారు.
See the shameless #Smile of Shahrukh. He has no regrets after burning a Hindu girl to de@th, even after being arrested. #JusticeForAnkita pic.twitter.com/LQ1rJAMOy9
— Akhilesh Kant Jha (@AkhileshKant) August 28, 2022