Girl Plan Kill Father: ఆ తండ్రి తన కూతుర్ని అల్లారముద్దుగా పెంచాడు. తన కాళ్లపై తాను నిలబడాలని ఉన్నత చదువులు చదివించాడు. కానీ.. కూతురు మాత్రం అందుకు ప్రతిఫలంగా తండ్రినే చంపాలనుకుంది. తన ప్రేమగా అడ్డుగా ఉన్నాడన్న ఉద్దేశంతో, ప్రియుడితో కలిసి తండ్రికి స్కెచ్ వేసింది. కొందరిని మాట్లాడి, సుపారీ కూడా ఇచ్చింది. చివరికి.. తానే అడ్డంగా దొరికిపోయింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మాదా తాలూకాకు చెందిన మహేంద్ర షా అనే వ్యాపారికి సాక్షి అనే కుమార్తె ఉంది. పూణెలో చదువుకుంటున్న ఈ యువతి చైతన్య అనే యువకుడితో ప్రేమలో పడింది. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న ఈ ఇద్దరూ.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. తన ప్రేమను తండ్రి అంగీకరించడు కాబట్టి, ప్రియుడితో లేచిపోవాలని సాక్షి భావించింది.
Extramarital Affair: పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి ప్రియుడితో సహజీవనం.. చివరికి ఏమైందంటే?
అయితే.. తన తండ్రి నుంచి ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందనుకున్న సాక్షి, కన్న తండ్రినే చంపాలని పథకం వేసింది. రక్తం తమ చేతికి అంటకుండా, ఇతరులతో హత్య చేయిద్దామని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. నలుగురు వ్యక్తుల్ని మాట్లాడి, తండ్రి హత్యకు సుపారీ ఇచ్చింది. ప్లాన్ ప్రకారం.. సాక్షి పూణె నుంచి మాదాకి వచ్చింది. షెట్‌ఫాల్ ప్రాంతంలో బస్సు దిగి, తనని పికప్ చేసుకోవడానికి రమ్మని తండ్రి మహేంద్రని పిలిచింది. కూతురి కోసం తండ్రి కారేసుకొని, బస్ స్టాప్‌కి వెళ్లాడు. ఆమెకి ఎక్కించుకొని తిరుగు పయనమయ్యాడు. వడచివాడి గ్రామానికి కొంత దూరంలో, కారు ఆపమని సాక్షి తన తండ్రిని కోరింది. ఆయన కారు ఆపగానే.. రెండు బైక్‌లపై నలుగు వ్యక్తులొచ్చి, ఆయనపై దాడి చేయడం మొదలుపెట్టారు. రెండు కాళ్ళు విరిచేయడంతో పాటు పదునైన ఆయుధంతో తలపై పొడిచారు. తన తండ్రిని చంపుతుంటే, సాక్షి అక్కడే నిలబడి చూస్తూ ఉంది.
Viral News: ఇదేం లవ్ రా బాబు… 66 ఏళ్ల వృద్దుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న 23 ఏళ్ల కుర్రాడు..!
మహేంద్ర గట్టిగా కేకలు వేయగా.. నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఆయన అరుపులు విని.. బాపు కాలే, రామ్ చరణ్ అనే వ్యక్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహేంద్రను వెంటనే ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన తండ్రిపై ఎవరో దాడి చేశారంటూ సాక్షి పెద్ద నాటకమే ఆడింది. అయితే.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, మహేంద్ర కూతురే అసలు నిందితురాలని తేల్చారు. ప్రియుడితో పెళ్లి కోసమే ఈ పథకానికి తెరలేపిందని పసిగట్టారు. దీంతో.. సాక్షి, ఆమె ప్రియుడు చైతన్యతో పాటు మహేంద్రపై దాడి చేసిన నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు.