పోలీసుల అరాచకం రోజురోజుకు పెరిగిపోతుంది. అధికారం ఉందన్న అహంకారంతో విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక మహిళా ఇన్స్పెక్టర్ చేసిన ఘోరం మహిళలకే మచ్చతెచ్చింది. అందరు చూస్తుండగా పోలీస్ స్టేషన్ లో మహిళా నిందితురాలి బట్టలు విప్పించి, డాన్స్ చేయించిన దారుణ ఘటన పాకిస్థాన్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో షబానా ఇర్షాద్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తుంది. క్వెట్టాలోని జిన్నా టౌన్‌షిప్‌లో చిన్నారి హత్య కేసు విచారణలో రిమాండ్ కి తీసుకొచ్చిన ఒక మహిళా నిందితురాలిని, షబానా ఇర్షాద్ విచారణ చేసింది. ఆమె నోరు విప్పకపోవడంతో దారుణానికి పాల్పడింది. మహిళ చేత బట్టలు విప్పించి, అందరి ముందు నగ్నంగా డాన్స్ చేయించింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు షబానాను ఉద్యోగం నుంచి తొలగించి, బాధిత మహిళను జైలు కస్టడీకి తరలించారు.