Bengal Rape Case: బెంగాల్‌లోని దుర్గాపూర్ లో మెడిసిన్ విద్యార్థిని అత్యాచార ఘటన మరవక ముందే, మరో ఘటన కోల్‌కతాలో జరిగింది. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ఆమె క్లాస్‌మేట్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడిని సిటీలోని ఆనందపూర్ ప్రాంతం నుంచి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Also: Pakistan: “ఆఫ్ఘాన్ నుంచి కాపాడండి”.. సౌదీ, ఖతార్‌లకు పాకిస్తాన్ ఫోన్..
డ్రగ్స్ కలిపిన కూల్‌డ్రింక్ తాగిన తర్వాత, మత్తులోకి వెళ్లానని, ఆ తర్వాత నిందితులు తనపై అత్యాచారం చేశాడని యువతి ఆరోపించింది. దుర్గాపూర్‌లో మెడికల్ కాలేజీ స్టూడెంట్ అత్యాచార సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే బీటెక్ స్టూడెంట్ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.
