Bengal Rape Case: బెంగాల్‌లోని దుర్గాపూర్ లో మెడిసిన్ విద్యార్థిని అత్యాచార ఘటన మరవక ముందే, మరో ఘటన కోల్‌కతాలో జరిగింది. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ఆమె క్లాస్‌మేట్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడిని సిటీలోని ఆనందపూర్ ప్రాంతం నుంచి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.