Bengal Rape Case: బెంగాల్‌లోని దుర్గాపూర్ లో మెడిసిన్ విద్యార్థిని అత్యాచార ఘటన మరవక ముందే, మరో ఘటన కోల్‌కతాలో జరిగింది. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ఆమె క్లాస్‌మేట్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడిని సిటీలోని ఆనందపూర్ ప్రాంతం నుంచి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నర్సాపూర్‌లోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో బుధవారం సాయంత్రం 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బివిఆర్‌ఐటి ఇంజనీరింగ్ కాలేజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ సూసైడ్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఆన్ లైన్ లో బెట్టింగ్ లు వేసి నష్టపోయి ఈ నెల 16న ఆత్మహత్య చేసుకున్నాడు తరుణ్(20). కాలేజీ ఫీజుల కోసం 40 వేల రూపాయలు పంపిన తండ్రి మీట్యా.. ఫ్రెండ్స్ వద్ద మరో 30 వేల రూపాయలు అప్పు చేసి ఆన్ లైన్…
టీచర్ తన సెల్ ఫోన్ తీసుకున్నరని ఓ విద్యార్థిని ఏకంగా చెప్పుతో కొట్టింది. ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ విచారకరమైన ఘటన విశాఖ, విజయనగరం మధ్య దాకమ్మరిలో ఉన్న ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది.
లోన్ యాప్ వేధింపులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. లోన్ యాప్ ఏజెంట్లు మరీ బరితెగించి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి ఇబ్బందులకు గురి చేస్తుండటంతో లోన్ తీసుకున్న బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కిడ్నాప్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఆచూకీ భీమవరంలో లభ్యం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్ధినిని కిడ్నాపర్ భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వుంచాడని తేలింది. కిడ్నాపర్‌ని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతికి స్నాప్ చాట్ ద్వారా పరిచయం అయ్యాడు భీమవరం మండలం కొత్త పూసలుమర్రుకి చెందిన ఫణీంద్ర. లాంగ్ డ్రైవ్ కి వెళ్దామని యువతిని నమ్మించాడు ఫణీంద్ర. ఆమెను భీమవరం బలుసుమూడి లో ఒక రూమ్ లో నిర్బంధించాడు.…
ఘట్‌కేసర్ జోడిమెట్లలో దారుణం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ ఫీజులు చెల్లించలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకోంది. విద్యార్థిని లావణ్య తాను చనిపోయేముందు సెల్ఫీ వీడియోను తల్లిదండ్రులకు పంపింది. ఫీజుల కోసం కాలేజ్ యాజమాన్యం వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ బలవన్మరణానికి పాల్పడింది.. యాజమాన్యం తీరుపై కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇటీవల ఇంజనీరింగ్ విద్యార్థుల ఆత్మహత్యలు కలిచివేస్తున్నాయి. చదువులకు అధిక ఫీజులు చెల్లించడం.. కుటుంబాలకు భారం అవుతున్నామనే భావనలో…