Kerala: మైనర్ కుమార్తెపై లైంగిక దాడి.. తండ్రికి మూడు “జీవితఖైదు” శిక్షలు విధించిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: మైనర్ బాలికపై కన్నతండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన కేరళలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు అతడికి మూడు జీవిత ఖైదు శిక్షల్ని విధించింది. బాలిక తల్లి గల్ఫ్‌లో పనిచేస్తుండగా, తండ్రితో కలిసి ఆమె అమ్మమ్మ వాళ్ల ఇంట్లో నివసించేంది. బాలికకు మొబైల్ ఫోన్ చూపిస్తాననే ఆశ చూపి, గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడే వాడని తేలింది.
గత ఏడాది జూలైలో ఆరేళ్ల కూతురుపై ఇలా పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తిరువనంతపురంలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (FTSC) న్యాయమూర్తి ఆర్ రేఖ నిందితుడైన తండ్రికి అత్యాచారం, పోక్సో ఇతర చట్టాల కింద శిక్షను ఖరారు చేశారు. సదరు వ్యక్తికి విధించిన శిక్షను ధృవీకరిస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ఎస్ విజయ్ మోహన్ మంగళవారం మాట్లాడుతూ.. లైంగిక నేరాలు, పిల్లల రక్షణ చట్టం(POCSO), ఐపీసీలోని వివిధ చట్టాల కింద శిక్షలను ఖరారు చేసినట్లు వెల్లడించారు. దీంతో పాటు నిందితుడికి రూ.90,000 జరిమానాను విధించింది.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
Read Also: Hari Ramajogaiah: ఎన్డీఏ కూటమికి విజ్ఞప్తి అంటూ హరి రామజోగయ్య లేఖ..
అయితే, ఈ శిక్షలు ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి జీవిత ఖైదును అనుభవిస్తారని ప్రాసిక్యూటర్ చెప్పారు. విచారణ సందర్భంలో ఇది తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి దారుణాలకు పాల్పడటం ‘తండ్రిపై ఉన్న నమ్మకానికి’’ మాయని మచ్చ అని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితురాలి బాల్యాన్ని దోచుకున్న ఇలాంటి నేరాలను సమర్థించలేమని పేర్కొంది.
బాలికకు మొబైల్ ఫోన్ చూపిస్తానని, గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడేవాడు. అయితే, బాలిక తన ప్రైవేట్ భాగాల్లో నొప్పి వస్తుందని అమ్మమ్మకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల తండ్రి తాగి ఇంటికి వచ్చినప్పుడు తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని బాధితురాలి 15 ఏళ్ల సోదరి కూడా కోర్టులో వాంగ్మూలాన్ని ఇచ్చింది. ఈ కేసులో విచారణ మార్చి 29, 2024న ప్రారంభమై నెల రోజుల్లో పూర్తయింది.
తాజావార్తలు
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్పై కన్ను
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..