Karnataka: కోడలిపై కోపంతో మనవడిని గొంతుకోసి చంపిన కసాయి అత్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. కొడలిపై కోపంతో ఓ అత్త సొంత మనవడినే హత్య చేసింది. కేవలం తొమ్మిది నెలల వయసున్న పసివాడిని గొంతు కోసి హత్య చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని గజేంద్ర నగర్ తాలూకాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన నవంబర్ 22న జరిగింది. విచారణలో సరోజా గూలీ అనే మహిళ తన కోడలు నాగరత్నను ఇష్టకపడకపోవడమే తొమ్మిది నెలల మనవడు అద్విక్‌ని చంపినట్లు వెలుగులోకి వచ్చింది.
Read Also: Tiger Reserve: దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్.. కేంద్రం ఆమోదం..
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
నాగరత్న తన తల్లిదండ్రుల ఇంట్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో అద్విక్‌కి జన్మనిచ్చింది. దాదాపు ఆరు నెలల పాటు అక్కడే ఉండి మూడు నెలల క్రితం అత్తగారింటికి తిరిగి వచ్చిందని పోలీసులు తెలిపారు. చిన్న వయసులో బిడ్డకు జన్మనివ్వడంతోనే సరోజా, తన కోడలు నాగరత్నపై పగ పెంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 22న తాను ఇంటి పని నిమిత్తం బయటకు వెళ్లానని, తిరిగి వచ్చే సరికి చిన్నారి కనిపించలేదని, అత్త సరోజాని అడిగితే తగిన సమాధానం చెప్పకపోవడంతో నాగరత్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో సరోజా తన నేరాన్ని అంగీకరించింది. పసికందును గొంతుకోసి చంపేసి ఆ తర్వాత మడ అడవుల్లో పాతిపెట్టినట్లు ఒప్పుకుందని గజేంద్రగఢ్ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్ష కోసం పంపారు. సరోజ బిడ్డకు తినకూడని పదార్థాలు తినిపించేదని నాగరత్న పోలీసులకు వెల్లడించింది. అయినా కూడా తన అత్తగారు ఇంత దారుణానికి ఒడికడతారని ఎప్పుడూ అనుకోలేదని నాగరత్న కన్నీరుమున్నీరైంది.
తాజావార్తలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Dada : ‘దాదా’ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?