నేటి తరం యువతకు ప్రాణం విలువ తెలియడంలేదు. చిన్న చిన్న కారణాలకు ప్రాణాలను వదిలేస్తూ కన్నవారికి కడుపుకోతను మిగులుస్తున్నారు. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామని. గేమ్ గెలవలేదని, టీవీ సీరియల్ చుడనివ్వలేదని. అమ్మ తిట్టిందని ఇలాంటి చిన్న కారణాలకే నిండైన జీవితాన్ని కాలరాస్తున్నారు. తాజాగా ఒక యువతి జుట్టు రాలిపోతుంది దారుణానికి తెగబడింది. జుట్టు లేకపోతె కీవితం నాశనమవుతుందని బాధపడి ఉరేసుకొని మృతిచెందింది. ఈ దారుణ ఘటన మైసూర్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని రాఘువేంద్ర లే అవుట్ కాలనీలో కావ్యశ్రీ(22) కుటుంబంతో కలిసి నివసిస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమెకు జుట్టు రాలిపోతోంది.. ఎన్నో మందులు వాడిచూసింది. అయినా ప్రయోజనం కనిపించలేదు.. రోజూ జుట్టు రాలిపోవడం చూసి ఆమె మనోవేదనకు గురైంది. జుట్టు లేకపోతే జీవితం ఎలా అని ఆలోచిస్తూ ఒక్కత్తే లోలోపల కృంగిపోయింది. ఇక ఈ నేపథ్యంలోనే శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో తన రూమ్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు కూతురు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించేసరికి వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. జుట్టు లేకపోతే స్నేహితులందరూ చిన్నచూపు చూస్తారని, జుట్టు రాలుతుందని కావ్య చెప్పి బాధపడేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.