Joy Alukkas: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు.. కానీ సీసీ కెమెరా పట్టేసింది! ‘షూ’ మ్యాజిక్ ఇది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joy Alukkas: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు.. అన్న సామెతకు నిదర్శనంగా నిలిచే ఘటన హైదరాబాద్ పంజాగుట్టలో వెలుగులోకి వచ్చింది. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పేరొందిన జాయ్ అలుకాస్ షోరూంలో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి ఏకంగా కోటి రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన విషయం ఆలస్యంగా బయటపడింది. పంజాగుట్టలోని జాయ్ అలుకాస్ షోరూమ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. వందలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఈ షోరూంలో ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లికి చెందిన గోపాలకృష్ణ సీనియర్ సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అతడు కొంతకాలంగా ఆభరణాల నిల్వలపై కన్నేశాడు. సరైన సమయం చూసి ఏకంగా కోటి రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. ఈ ఘటనను గోప్యంగా విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
READ ALSO: Vijayawada: సిటీలో టెన్షన్.. విజయవాడలో వందల బైకులతో రౌడీషీటర్ల ర్యాలీ కలకలం..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
సాధారణ ఆడిట్ నిర్వహణలో భాగంగా బంగారు ఆభరణాల నిల్వలో తేడాలు కనిపించడంతో యాజమాన్యం అప్రమత్తమైంది. అయితే షోరూంలో ప్రతిచోటా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగ ఎవరో తేలకపోవడంతో ఈ వ్యవహారం మిస్టరీగా మారింది. విషయం బయటకు రాకుండా యాజమాన్యం అంతర్గతంగా రోజూ సీసీటీవీ ఫుటేజీలను గోప్యంగా పరిశీలించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విషయం కనుగొన్న తర్వాత జాయ్ ఆలుక్కాస్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. గోపాలకృష్ణ తను కూర్చునే కౌంటర్ దగ్గర ఆభరణాలను ఎవరికి తెలియకుండా కింద పడేసి.. వాటిని సాక్స్‌లో దాచుకుని షూలో పెట్టుకుని బయటకు వెళ్లేవాడు. ఇలా ప్రతిరోజు దాదాపు 10 గ్రాముల చొప్పున బంగారం తీసుకెళ్లి పది రోజుల్లో ఒక కిలోకు పైగా ఆభరణాలను చోరీ చేసినట్లు వెల్లడైంది. మరోవైపు పోలీసులు గోపాలకృష్ణను … స్టేషన్‌కు పిలిపించి తమదైన శైలిలో విచారించగా తానే చోరీకి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు.
నిందితుడి వద్ద నుంచి కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. షోరూంలో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఎవరికి అనుమానం రాకుండా చాకచక్యంగా చోరీ చేయడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన నగరంలోని జువెలరీ షోరూంల భద్రతపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరోవైపు గోపాలకృష్ణ ఒక్కడే ఈ చోరీ చేశాడా? ఈ కేసులో మరెవరైనా అతడికి సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
READ ALSO: Hardik Pandya Watch: పాండ్య వాచ్ ధర ముందు.. పాక్ కెప్టెన్ జీతం కూడా దిగదుడుపే!
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!