Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
- గ్రేటర్ నోయిడాలో విషాదం
- కదులుతున్న స్లీపర్ బస్సులో భారీ అగ్నిప్రమాదం, 9 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yamuna Expressway Bus Fire: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తున్న స్లీపర్ బస్సులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం యమునా ఎక్స్‌ప్రెస్‌వే జీరో పాయింట్ నుంచి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, జేవర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బుధవారం-గురువారం అర్ధరాత్రి సమయంలో సుమారు 11:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
40 నుంచి 50 మంది ప్రయాణికులు
జాయింట్ సీపీ రాజీవ్ నారాయణ్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 నుంచి 50 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు ప్రయాణికులు బస్సు నుంచి కిందకు దూకినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read
- Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. దుబాయ్‌లో రవి ఉప్పల్ అరెస్ట్..! తెరపైకి రాజకీయ నేతలు, అధికారుల లీలలు
- Delhi Gang Rape Case: యూఏఈ నుంచి కామాంధుడి అప్పగింత!
- Meerpet Horror: కసాయి అల్లుడు.. కత్తులతో మారణహోమం!
- Hyderabad: రూ.6.78 కోట్ల నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్..
పూర్తిగా దగ్ధమైన బస్సు
మంటలు వేగంగా వ్యాపించడంతో కొద్దిసేపట్లోనే బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో మరికొందరు ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాతే బస్సులో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎంతమంది ప్రమాదానికి గురయ్యారు? అనే విషయాలు స్పష్టమవుతాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. పోలీసులు, స్థానిక అధికారులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఘటనపై సీఎం యోగి ఆరా
గ్రేటర్ నోయిడా బస్సు అగ్నిప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఢిల్లీ నుంచి మహోబాకు వెళ్తున్న బస్సు
ప్రమాదానికి గురైన బస్సు రాజ్ కల్పనా ట్రావెల్స్‌కు చెందిన BR32 PA8647గా గుర్తించారు. ఈ బస్సు ఢిల్లీ నుంచి మహోబాకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ట్రావెల్స్‌కు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కువగా సర్వీసులు ఉన్నట్లు సమాచారం.
అగ్నిప్రమాదానికి కారణం ఏంటి?
ప్రస్తుతం బస్సులో మంటలు ఎలా చెలరేగాయనే విషయం స్పష్టంగా తెలియలేదు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సులోని ప్రయాణికులను విచారించి ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలు, దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. చెవిరెడ్డికి పులివర్తి సుధ వార్నింగ్!
-
CERT-In Warning: “హ్యాక్ చేసే ప్రమాదం”.. టాటా కార్ల వినియోగదారులకు ప్రభుత్వ సంస్థ హెచ్చరిక..
-
Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? పరిశోధనలో బయటపడ్డ నమ్మలేని నిజాలు
-
Digvijaya Singh: “హిందూత్వం సమాజంలో ద్వేషాన్ని పెంచుతుంది”.. దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
-
Jacob Duffy: కోహ్లీకి బౌలింగ్ చేయడం విసుగు తెప్పించింది.. ఆర్సీబీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
ట్రెండింగ్
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!