Fake Tea Powder: మనం తాగేది చాయ్ కాదు.. భాగ్యనగరంలో కల్తీ టీ పొడి ముఠా గుట్టురట్టు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Tea Powder: చాయ్.. ఓ రిలాక్సేషన్… వర్క్ మోడ్‌లో నుంచి కాస్త రీఎనర్జైజ్ కావాలంటే టీ పడాల్సిందే..!! ముఖ్యంగా ఆఫీసులలో పని చేసే వారు.. రోడ్డు పక్కన ఉన్న టీ హోటల్స్‌లో చాయ్ తాగుతుంటారు. కానీ ఆ టీ సేఫేనా? అందులో వేసే టీ పౌడర్ నాణ్యమైనదేనా? ఇలా ఎవరూ డౌట్ పడి ఉండరు. కానీ ఆ టీ పౌడర్‌ను కూడా కొంత మంది కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. అలాంటి ఓ కేటుగాడ్ని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఈ నకిలీ టీ పొడి దందాని పోలీసులు బయట పెట్టారు. టీ పొడి కల్తీ ముఠాను అరెస్ట్ చేశారు.
READ ALSO: TamilNadu: ప్రేమోన్మాదానికి ఒకే ఇంట్లో ఇద్దరి హత్య.. ఒకరి పరిస్థితి విషమం
Also Read
- Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ బృందం, సనత్ నగర్ పోలీసులతో కలిసి సనత్ నగర్ పరిధిలోని ఒక ప్రాంగణంపై దాడి చేసింది. సింథటిక్ రసాయనాలను ఉపయోగించి టీ పొడిని కల్తీ చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితున్ని జగన్నాథ్ బిష్ణోయ్‌గా గుర్తించారు. అధిక లాభాల కోసం టీ పొడి కల్తీ చేస్తున్నట్లు అతడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. కోకోపీట్ అంటే కొబ్బరి పీచు పొడిని కొనుగోలు చేసి.. అందులోని వ్యర్థాలను తొలగిస్తాడు. దానికి వేడి బెల్లం నీటితో కలిపి రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టేవాడు. ఆ తర్వాత దానికి ‘సన్‌సెట్ ఎల్లో’ , ‘టార్ట్రాజైన్ ఆరెంజ్’ వంటి సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను కలిపేవాడు. ఈ రంగులను పీల్చుకున్న మిశ్రమాన్ని తిరిగి ఎండబెట్టి కల్తీ ప్రక్రియలో ఉపయోగిస్తున్నట్లు తేలింది.
ఒక కిలో కల్తీ టీ పొడిని తయారు చేయడానికి, నిందితుడు 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్, 500 గ్రాముల నాణ్యత లేని టీ గ్రాన్యూల్స్, 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్‌ను మిక్స్ చేసేవాడు. ఈ కల్తీ టీ పొడిని అసలైన టీ పొడిగా నమ్మించి స్థానిక టీ స్టాళ్లకు, ఇతర డీలర్లకు భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడి వద్ద 120 కిలోలు రంగు కలిపిన టీ పొడి, సహజమైన టీ పొడి 30 కిలోలు, కోపీట్ మిశ్రమం 138 కిలోలు, సన్‌సెట్ ఎల్లో కలర్ 800 గ్రాములు, టార్ట్రాజైన్ కలర్ 700 గ్రాములు, బెల్లం బాక్సులు 12 స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రజలు టీ పొడిని కేవలం గుర్తింపు పొందిన విక్రేతల వద్దే కొనుగోలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆహార కల్తీకి సంబంధించి ఏవైనా అనుమానాలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
READ ALSO: ViRosh Wedding: రష్మిక – విజయ్ పెళ్లి ఫోటోలు వైరల్..
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!