Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai Crime: ప్రియురాలి పుట్టినరోజుకు ఐఫోన్ బహుమతిగా ఇవ్వాలనే ఆశతో ఓ యువకుడు చైన్ స్నాచింగ్‌కు పాల్పడి చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని అమైందకరై ప్రాంతానికి చెందిన సరవణన్ అనే యువకుడు ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఐఫోన్ కొనుగోలు చేసేందుకు డబ్బు సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో సరవణన్ నంబర్ ప్లేట్ లేని బైక్‌పై తిరుగుతూ చైన్ స్నాచింగ్‌కు ప్రణాళిక రచించాడు. గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖానికి గుడ్డ కట్టుకుని మాధవరం, అన్నా నగర్ ప్రాంతాల్లో మూడు సార్లు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యాడు. అనంతరం నాలుగో ప్రయత్నంలో అమైందకరైలో మలర్విళి అనే మహిళ మెడలోని బంగారు గొలుసును అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే దొంగతనం అనంతరం పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, నిందితుడు ధరించిన జీబ్రా డిజైన్ చొక్కా కీలక ఆధారంగా మారింది.
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Supreme Court: "మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
ఇక, ఆ చొక్కా ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అమైందకరై పోలీసులు సరవణన్ను గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రేమను చాటుకునేందుకు చేసిన నేరం చివరకు అతడిని జైలు ఊచలు లెక్కబెట్టే పరిస్థితికి తీసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. బర్త్ డే రోజు ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చి ప్రియురాలి కళ్లల్లో ఆనందం చూసుకుందామనుకున్న ఆ యువకు చివరకు.. ఆ గిఫ్ట్ కోసం చేసిన దొంగతనం ఇప్పుడు ఊచలు లెక్కపెట్టేలా చేసింది..
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!