Kidnap : మీర్ చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలన కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకుంది. సుల్తాన్‌షాహీ ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల బాలికను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పంజేషా సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలిక సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా, సయ్యద్ షబ్బీర్ అలీ అనే ఆటో డ్రైవర్ ఆమెను తన ఆటోలోకి ఎక్కించాడు. “నీ తండ్రి పంపించాడు, ఆటోలో ఎక్కు” అని చెప్పడంతో నిర్భయంగా ఆటోలో కూర్చుంది.
Secunderabad: కోచ్ వేధింపులతో విద్యార్థిని బలి.. కీచక కోచ్ అరెస్ట్..
తర్వాత డ్రైవర్ ఆమెను మలక్‌పేట్ వైపు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన బాలిక ధైర్యంగా ఆటో నుండి దూకి బయటపడింది. ఆ సమయంలో స్థానికులు ఆ దృశ్యాన్ని గమనించి ఆటో డ్రైవర్‌ను పట్టుకుని మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. అనంతరం మలక్‌పేట్ పోలీసులు నిందితుడు సయ్యద్ షబ్బీర్ అలీతో పాటు బాధిత బాలికను మీర్ చౌక్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. బాలిక తండ్రి పండ్లు అమ్ముకునే వ్యాపారం చేస్తుండగా, పోలీసులు పాక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Rajasthan: రాజస్థాన్‌లో బస్సు ప్రమాదం.. నిప్పంటుకుని 15 మందికి గాయాలు..