Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double Bedroom House Scam: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల.. కానీ ఇల్లు కట్టాలంటే మాటలు కాదు.. లక్షల రూపాయలు వెచ్చించాలి. ఈ క్రమంలో పేదలకు సొంతింటి కల.. అందని ద్రాక్షగానే మిగులుతోంది. దీంతో అర్హులైన వారికి ప్రభుత్వమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తోంది. కానీ దీనిలోనూ ప్రవేశించిన కేటుగాళ్లు.. మీకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కావాలా? జస్ట్ మాకు డబ్బులు ఇస్తే చాలు.. అన్ని పనులు మేమే పూర్తి చేస్తాం. మీకు డబుల్ బెడ్‌రూమ్ ఇప్పిస్తాం. ఇదిగో చూడండి.. గతంలో చాలా మందికి ఇప్పించాం. అని పత్రాలు చూపిస్తూ ఓ ముఠా పేదలను లక్ష్యంగా చేసుకుని దందా చేస్తోంది. అలాంటి ముఠా ఆట కట్టించారు హైదరాబాద్ పోలీసులు. అందులో ఉన్న ఓ మహిళ ఈ దందాను నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఏకంగా కలెక్టర్‌తోపాటు ఎమ్మార్వో సంతకాలనే ఫోర్జరీ చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. ఇంతకీ ఆ కిలాడీ లేడీ ఎవరు? పోలీసుల విచారణలో బయటపడిన సంచలన విషయాలు ఏంటి అనేది చదవేయండి.
READ ALSO: Ganja Murders: మత్తులో మృగాళ్లు.. భాగ్యనగరంలో గంజాయి బ్యాచ్‌ల వీరంగం.. రెండు రోజుల్లో ఇద్దరి బలి!
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
ఓ మహిళ నేతృత్వంలో మొత్తం నలుగురు ముఠాగా ఏర్పడ్డారు. వారు కల్లు దుకాణాల వద్ద మకాం వేస్తారు. కొంత మందిని గుర్తించి ..వారికి మద్యం తాగిస్తారు. వారు మత్తులోకి జారుకున్న తర్వాత వాళ్లతో సంతకాలు పెట్టిస్తారు. ఆ సంతకాలే తీసుకువెళ్లి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయించామని చూపెట్టి డబ్బులు వసూలు చేస్తారు. ఏకంగా కలెక్టర్, ఎమ్మార్వో, ఆర్డీఓల సంతకాలని కూడా కల్లు దుకాణాల వద్ద పెట్టించి నిరుపేదలకు చూపెట్టి డబ్బులు వసూలు చేస్తోంది ఈ ముఠా. గత కొన్నాళ్ల నుంచి ఈ ముటా ఇలాగే డబుల్ బెడ్‌రూమ్ పేరుతో మోసాలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో ఒక మహిళ కీలకంగా వ్యవహరిస్తోందని చెబుతున్నారు. ఈ మహిళనే నకిలీ సంతకాలు.. నకిలీ పత్రాలు తయారు చేయించి ఇల్లులేని వారికి చూపెట్టి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతుంది. నగరానికి చెందిన ఓ మహిళ ముగ్గురితో కలసి ముఠా ఏర్పాటు చేసింది. ఆటోలో చక్కర్లు కొడుతూ… పేదలు నివసించే కాలనీలే లక్ష్యంగా చేసుకుంటుంది. తన పలుకుబడితో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెబుతుంది. ఒక్కొక్కరి నుంచి 15 వేల రూపాయలు వసూలు చేస్తుంది. సచివాలయం వద్ద పాగా వేసి అక్కడకు వచ్చే వారిలో అమాయకులను ఎంచుకొని ఉద్యోగాలిప్పిస్తానంటూ బురిడీ కొట్టిస్తుంది. గతంలో పోలీసు కేసు నమోదైన అరెస్ట్ చేయకపోవటంతో దర్జాగా దందా చేసింది. సుమారు 300 మందిని మోసగించింది.
ఇటీవల ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితురాలితో సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నకిలీ పత్రాలపై ఆర్డీవో, కలెక్టర్ సంతకాలను పోర్జరీ చేసినందుకు ఓ వ్యక్తికి రోజూ రూ.100 ఇచ్చినట్టు దర్యాప్తులో గుర్తించారు. మద్యం మత్తులో ఉన్న అతడు ఉన్నతాధికారుల సంతకాలు చేయటం పోలీసులను విస్మయానికి గురిచేసింది. సంక్షేమపథకాలను ఇప్పిస్తామంటూ నగరంలో పలువురు దళారులు లబ్దిదారుల నుంచి పెద్దఎత్తున సొమ్ములు వసూలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఈ అక్రమాల వ్యవహారంలో కొందరు చోటానేతలు, గల్లీ లీడర్ల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. సొంతింటి కలను నిజం చేస్తామని నమ్మించి దరఖాస్తు చేసేందుకు ఖర్చులంటూ మొదట 5 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల ఆమోదం వచ్చిందని నకిలీపత్రాలను చూపుతున్నారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ గృహ సముదాయం వద్దకు లబ్దిదారులను తీసుకెళ్తున్నారు. ఇల్లు మంజూరు చేశామంటూ నకిలీ తాళం చెవి, పట్టా చేతికిచ్చి రూ. 25వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయి లబ్దిదారులు మోసపోయామని గ్రహించేలోపు మరో ప్రాంతంలో మకాం వేస్తున్నారని పోలీసు అధికారి తెలిపారు. అంబర్‌పేట్, మలక్‌పేట్, ముషీరాబాద్, బోరబండ, ఎస్సార్‌నగర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో కొందరు మహిళలు ముఠాగా ఏర్పడి ఈ దందా చేస్తున్నారని అన్నారు.
READ ALSO: Bengal Election: బెంగాల్ రాజకీయ కురుక్షేత్రంలో కొత్త పొత్తు.. దీదీ తృణమూల్ కోటలకు బీటలు వారుతాయా?
- Tags
తాజావార్తలు
-
Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
-
Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..
-
Nandana: 10 గంటలు పోలీసుల కస్టడీలో ఉన్నా పెదవి విప్పని నందన?
-
Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్‌లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
-
Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!