Australian Cricketer: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆస్ట్రేలియా క్రికెటర్‌కు జీవితకాల జైలు శిక్ష!
- 15 ఏళ్ల బాలికపై అత్యాచారం
- ఆస్ట్రేలియా క్రికెటర్‌కు జీవితకాల జైలు శిక్ష
- సమ్మర్స్‌కు ఇలాంటి కేసులు కొత్తవి కావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaron Summers Australian Cricketer Faces Jail: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం, అసభ్యకరమైన విషయాలకు ప్రేరేపించిన కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోన్ సమ్మర్స్ దోషిగా తేలాడు. ఈ కేసులో అతడికి ఆగస్టులో కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మీడియా ‘ది కాన్బెర్రా టైమ్స్’ వెల్లడించింది. ఈ రెండు కేసులలో తాను దోషి అని స్వయంగా సమ్మర్స్ అంగీకరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకప్పుడు ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ పేసర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సమ్మర్స్.. ఇప్పుడు అత్యాచార కేసుల్లో చిక్కుకుని జైలు శిక్షను ఎదుర్కొనే పరిస్థితికి చేరుకున్నాడు.
ది కాన్బెర్రా టైమ్స్ కథనం ప్రకారం.. 2018 జనవరిలో బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో హోబార్ట్ హరికేన్స్ జట్టుకు ఆరోన్ సమ్మర్స్ ప్రాతినిధ్యం వహించాడు. ఆ సమయంలో సోషల్ మీడియా ద్వారా 15 ఏళ్ల బాలికతో అతడు పరిచయం పెంచుకున్నాడు. అనంతరం స్థానిక పాఠశాల ప్రాంగణంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికపై లైంగిక దాడి, అసభ్యకరమైన విషయాలకు ప్రేరేపించే ఉద్దేశంతో గ్రూమింగ్ చేసిన రెండు ప్రధాన ఆరోపణలను కోర్టులో సమ్మర్స్ అంగీకరించాడు.
Also Read
- India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
ఆరోన్ సమ్మర్స్ తరఫు న్యాయవాది కరోలైన్ గ్రేవ్స్ కోర్టులో మాట్లాడుతూ.. ఆ సమయంలో అతడు తీవ్ర మానసిక ఒత్తిడి, ఒంటరితనం ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నాడు. సోషల్ మీడియాను అధికంగా ఉపయోగించడం వల్ల తప్పు దారిలో నడిచాడని తెలిపాడు. ‘ఈ సంఘటన ఆరోన్ సమ్మర్స్‌ను జీవితాంతం వెంటాడుతుంది. అయినప్పటికీ అతడు తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇకపై ఇలాంటి నేరాలకు పాల్పడడు. 2018లో సమ్మర్స్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ పేసర్. అప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి’ అని కోర్టుకు వివరించారు.
ఆరోన్ సమ్మర్స్‌కు ఇలాంటి కేసులు కొత్తవి కావు. 2021లో కూడా పిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు కలిగి ఉండటం, వాటిని ఇతరులకు పంపించడం వంటి కేసుల్లో దోషిగా నిలిచాడు. ఆ కేసులో ఇప్పటికే కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఈసారి శిక్షను తగ్గించాలని సమ్మర్స్ తరఫు న్యాయవాది కోర్టును కోరినా.. న్యాయమూర్తి ఆ అభ్యర్థనను తిరస్కరించారు. బెయిల్‌పై బయట ఉన్న సమ్మర్స్‌ను కోర్టు మళ్లీ జ్యుడీషియల్ కస్టడీలోకి పంపింది. ప్రస్తుతం అతడు జైలులోనే ఉండగా.. ఈ కేసులో తుది శిక్షను ఆగస్టులో ప్రకటించనున్నారు. నేరాల తీవ్రత దృష్ట్యా అతడికి దీర్ఘకాల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.
30 ఏళ్ల ఆరోన్ సమ్మర్స్ ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో టాస్మానియా తరఫున ఆడాడు. బిగ్ బాష్ లీగ్‌లో హోబార్ట్ హరికేన్స్‌కు ఒక మ్యాచ్, పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్ తరఫున రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాడని భావించిన అతడి కెరీర్.. వరుస లైంగిక నేరాలతో క్లోజ్ అయింది. ప్రస్తుతం క్రికెట్ కంటే.. కోర్టు కేసులు, జైలు శిక్షల కారణంగానే అతడు వార్తల్లో నిలుస్తున్నాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..