AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్‌కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- రాష్ట్రంలో బంగారు ఖనిజ నిక్షేపాల పై గనుల శాఖ దృష్టి..
- లక్షన్నరకు పైగా హెక్టార్లలో బంగారు నిక్షేపాలు ఉన్నట్టు అంచనా ..
- ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరి లో బంగారు ఖనిజ తవ్వకాలు..
- నాలుగు దశల్లో తవ్వకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Gold Mining: ఆంధ్రప్రదేశ్‌లో బంగారు ఖనిజ నిక్షేపాల గుర్తింపు, తవ్వకాలపై గనుల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో బంగారు ఖనిజ నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు, వాటి అన్వేషణకు కార్యాచరణను వేగవంతం చేస్తున్నారు.
ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు ఖనిజ తవ్వకాలు, ఉత్పత్తి కొనసాగుతుండగా, ఇప్పుడు అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కూడా బంగారు నిక్షేపాల అన్వేషణపై గనుల శాఖ దృష్టి పెట్టింది. ఈ ప్రాంతాల్లో ఖనిజ తవ్వకాల ప్రక్రియను నాలుగు దశలుగా (జీ-1, జీ-2, జీ-3, జీ-4) చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది.
Also Read
- Ambati Rambabu : ఋషికొండపై విమర్శలు కాదు.. విచారణ చేయండి
- AP Panchayat Elections 2026: రేపే రెండో విడత పల్లె పోరు.. బరిలో 10,295 మంది సర్పంచ్ అభ్యర్థులు.. నిఘా నీడలో పోలింగ్..!
- AP High Court: ధర్మాన ప్రసాదరావుకు ఏపీ హైకోర్టులో ఊరట.. పోలీసులకు కీలక ఆదేశాలు!
- CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
జాతీయ ఖనిజ అన్వేషణ అభివృద్ధి నిధుల (National Mineral Exploration Trust – NMET) సహకారంతో ఈ అన్వేషణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. తవ్వకాల ద్వారా బంగారు నిక్షేపాల పరిమాణం, నాణ్యతపై స్పష్టత వచ్చిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ రాష్ట్ర ఖనిజ రంగ అభివృద్ధితో పాటు పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పెరుగుదలకు దోహదపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Shashi Tharoor: 850 మంది ఎంపీలతో లోక్‌సభ నడుస్తుందా?.. చప్పట్లు కొట్టడానికే చాలామంది వస్తారు..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
PM Modi AP Tour: తిరుపతిలో ప్రధాని మోడీ పర్యటన.. మూడు రోజుల పాటు బిజీ షెడ్యూల్, భారీ భద్రతా ఏర్పాట్లు!
-
AP Panchayat Elections 2026: రెండో దశ పోలింగ్‌లో ఉద్రిక్తతలు.. నకిలీ బ్యాలెట్ పేపర్లు, రాళ్ల దాడులు!
-
MK Stalin: “రాజీపడే ప్రసక్తే లేదు”.. రాహుల్ గాంధీ చెన్నై పర్యటనకు ముందు స్టాలిన్ కీలక సందేశం..
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్‌కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!