BE ALERT: అప్పు తీర్చలేదని 21 రోజుల పసికందు కిడ్నాప్.. రెండు గంటల్లోనే తల్లి చెంతకు
- మంజుల వద్ద రూ.30 వేలు అప్పుగా తీసుకున్న అనిత
- అనిత ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగిన మంజుల
- 21 రోజుల పసిబాబును తీసుకెళ్లిన మంజుల మనుషులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివారులో అమానుష ఘటన వెలుగు చూసింది. తీసుకున్న అప్పు తీర్చలేదని పసికందుకు ఎత్తుకెళ్లారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ నగర్లో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అసలు ఈ కేసులో ఏం జరిగింది? 21 రోజుల పసిబాబు అని కూడా చూడకుండా కొంత మంది ప్రవర్తించారు. బాబును ఇంటి నుంచి ఎత్తుకెళ్లడంతో కన్న తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. పోలీసులు వేగంగా స్పందించి రెండు గంటల్లోనే బాబును గుర్తించి తల్లి వద్దకు చేర్చారు.
హనుమాన్ నగర్‌కు చెందిన అనిత, ఆమె భర్త రాఘవేందర్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబ అవసరాల కోసం హఫీజ్‌పేట్‌లో ఇంటి పక్కన నివసించే మంజుల అనే మహిళ వద్ద రూ.30 వేలు అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. అప్పు తిరిగి చెల్లించే విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు అనిత ఇంటికి వచ్చి ఆమెతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కలిసి ఆటోలో ఇంట్లో ఉన్న 21 రోజుల పసిబాబును తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read
- Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
- Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
తన బిడ్డను తీసుకెళ్లొద్దంటూ అనిత వారి కాళ్లపై పడి వేడుకున్నప్పటికీ.. ఆమెను పక్కకు నెట్టివేసి బాబును తీసుకెళ్లారని ఆరోపించింది.పసిబాబును తీసుకెళ్లిన విషయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాబును ఎక్కడికి తీసుకెళ్లారనే వివరాలపై ఆరా తీసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు, స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో పోలీసులు వేగంగా చర్యలు చేపట్టారు. దాదాపు రెండు గంటల్లోనే బాబును గుర్తించిన పోలీసులు.. అతడిని తిరిగి తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
అప్పు విషయంలో వివాదం ఉన్నప్పటికీ పసిబిడ్డను ఇలా తీసుకెళ్లడం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పసిబిడ్డను బలవంతంగా తీసుకెళ్లిన ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కేవలం అప్పు వివాదం కారణంగా 21 రోజుల పసిబిడ్డను తీసుకెళ్లడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
తాజావార్తలు
-
Independence Day : పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం..
-
Venky Anil 5: 40 ఏళ్ల కెరీర్లో వెంకీ మామ కొత్త అవతార్.. లెఫ్టినెంట్ కల్నల్‌గా అదరగొట్టేశాడు!
-
August 15 History: ఆగస్టు 15.. భారత్‌కే కాదు ఈ 3 సరిహద్దు దేశాల చరిత్రలోనూ కీలక రోజే!
-
Modi-Rahman: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
-
Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!